Bhumilo neeru nilvachesukunenduku vaananeeti samrakshanaa paddathulu. vivarangaa...telusukondam kosam.

భూమిలో నీరు నిల్వచేసేందుకు వాననీటి సంరక్షణా పద్ధతులు

అరుదైన మంచినీరు
 • భూమి మీద మొత్తం నీటిలో 3% మాత్రమే మంచి నీరు. మిగతా నీరంతా మహా సముద్రాలలోని ఉప్పు నీరు.
 • 800 మీటర్ల లోతు వరకు భూమి లోపల మంచి నీరు 11% వరకు లభ్యమగును, వాడకానికి రాబట్టు కొనవచ్చును.
 • ప్రకృతిలో దొరికే అతి మూల్యమైన, అతి తక్కువ పరిమాణంలో దొరికే ఈ ప్రకృతి వనరు తెలివి తక్కువ తనంతో రాబట్టుకోవటం మరియు స్వలాభార్జన వలన, దాని నాణ్యత మరియు పరిమాణము రెండింటి లోను వేగంగా క్షీణత మరియు గుణము చెడుట వంటి లక్షణములు సంభవించినవి.
భూమిలో నీటి సంరక్షణ మార్గములు మరియు మెళుకువలు
పట్టణ ప్రదేశాలు
పల్లె ప్రదేశాలు
ఇంటి పై కప్పు మీద వాన నీటిని వీటి ద్వారా సంగ్రహించవచ్చు
 • రిఛార్జి గొయ్యి   
 • రిఛార్జి కందకము
 • గొట్టపుబావి  
 • రిఛార్జి బావి
       వాన నీటిని వీటిద్వారా సంగ్రహించవచ్చు
 • గల్లీ ప్లగ్
 • కంటూర్ బండ్
 • గ్యాబియన్ స్ట్రక్చర్        
 • పెర్కొలేషన్ ట్యాంక్
 • చెక్ డామ్/ సిమ్మెంట్ ప్లగ్ / కాల్వ గట్టు
 • రిఛార్జి  షాప్ట్
 • డగ్ వెల్ రిఛార్జి
 • భూమి నీటి ఆనకట్టలు/ఉప-ఉపరితల కట్ట

పల్లెప్రాంతాలలో భూమి నీటి సంరక్షణా పద్ధతులు
పల్లెప్రాంతాలలో వాటర్ షెడ్ ఒక విభాగంగా పరిగణించి వాననీటి సంరక్షణ చేయబడును. ఉపరితల విస్తరీ కరణ పద్దతులు సహజమే ఎందుకంటే ఇటువంటి విధానములకు ఎక్కువ స్థలము దొరుకుతుంది మరియు రిఛార్జి చేయవలసిన నీటిమొత్తం కూడా ఎక్కువే. ఈ క్రింది ఇచ్చిన పద్దతుల సహాయంతో నీరు నదులలోకి, పల్లాలలోకి మరియు కాల్వలలోకి వెళ్ళి వృధాకాకుండా అవలంబించవచ్చు.
i. గల్లీ ప్లగ్
 • గల్లీ ప్లగ్ లు స్థానిక రాళ్ళు, బంకమట్టి మరియు చిన్న కాలువలకు అడ్డంగా ఉండే ముళ్ళ పొదలతో మరియు వానాకాలంలో మురుగు కాల్వల నుండి చిన్న పాయలతో పాటు కొండ వారుగా పారే కాల్వలలో నిర్మిస్తారు.
 • గల్లీ ప్లగ్ లు మట్టిని మరియు తేమని సంరక్షించుటలో సహాయపడును.
 • కట్టల వెనకాల సరిపడేంత నీరు నిలువ ఉంచుటకు వీలుకల్పించడానికి, సమీపంలో ఏదైన గట్టు తెగినప్పుడు గల్లీ ప్లగ్ ల కొరకు స్థలం చూసి ఎంచుకొనవచ్చును.
ii. కందకం (కంటూర్ బండ్)

 • వాటర్ షెడ్ లో ఎక్కువకాలం మట్టి తేమను కాపాడుటకు ఈ కట్ట (బండ్)లు చాలా మంచి పద్ధతులు.
 • తక్కువ వర్షపాతం ఉన్న ప్రాంతాలలో ఈ కట్టలు బాగా అనుకూలంగా  ఉంటాయి. వాలు భూమి మీద సమాన ఎత్తులో ఉన్న ఆకృతి అనుసరించి కట్టలను కట్టి వర్షాకాలపు నీటిని నిలువ చేయవచ్చు.
 • కట్టల మధ్య సరైన ఖాళీ ఉంచటం వలన పారేనీటి వేగాన్ని నియంత్రించి నీటిని సంరక్షణ చేయవచ్చు.
 • రెండు కట్టల మధ్య ఖాళీ, మట్టి యొక్క వాలు, ప్రాంతం, మరియు నీటి నిల్వ సామర్థ్యాన్ని బట్టి ఉంటుంది. మట్టి సామర్థ్యం ఎంత తక్కువఉంటే, కట్టల మధ్య ఖాళీ అంత తక్కువఉండాలి.
 • ఎగుడూ దిగుడూ లేని సుమారుగా ఉన్న వాలు గల భూములకు, ఈ కట్టలు అనుగుణంగా  ఉంటాయి.
iii. గ్యాబియోన్ ఆకృతి (వల లేదా జాలీ లో గుళ్ళరాళ్లను వేసి కట్ట గా వేయడం)
 • నీటిని సంరంక్షించడానికి వాటి మీదుగా కట్టే చిన్న ఆనకట్టలవంటివి.
 • కాలువ మీదుగా స్టీల్ వైర్ల జాలీలో అక్కడ దొరికే గుండ్రాయిలను అంటే గులక రాళ్ళను పెట్టి కట్టని నిర్మిస్తారు మరియు ఏటి ఒడ్డుకు కడతారు.
 • ఇటువంటి ఆకృతుల ఎత్తు సుమారు 0.5 మీటర్లు మరియు సాధారణంగా 10 మీటర్లు కన్నా తక్కువ వెడల్పు ఉన్న కాలువలలో వాడతారు.
 • అధికనీరు ఈ నిర్మాణం మీదుగా పారి, కొంతనీటిని నిల్వ ఉంచడం ద్వారా నీరు భూమిలోకి  ఇంకుతుంది. బండరాళ్ళ ఖాళీలలో కొంత కాలానికి  కాలువ నీరు యొక్క ఒండ్రుమట్టి అడుగున చేరుతుంది.  మొక్కలు పెరిగిన తరువాత, కట్ట ఇంకా గట్టిగా అయ్యి, వానల తర్వాత కొంత కాలం  సమయం వరకు ఉపరితల నీరు పోకుండా దోహదపడి భూమిలో నీటి శాతాన్ని పెంచుతుంది.
 

iv పెర్కొలేషన్ ట్యాంకు (పెద్ద చెరువులు )

 • పెర్కొలేషన్ ట్యాంకు, ఉపరితల నీటిని లోపలకి పోనిచ్చి భూమిలో నీటిని నిల్వ చేయడానికి,   కృత్రిమంగా చేసిన ఉపరితల నీటి చెరువు.
 • ఎక్కువ పగ్గుళ్ళు మరియు అరిగిపోయిన రాళ్ళ మీద పారే రెండు నుండి మూడవ క్రమమైన కాలువల మీద పెర్కొలేషన్ ట్యాంకుని కట్టవలెను. దీనికి ఏరు క్రిందికి నిరంతరంగా ప్రక్క ఏరులు ఉంటాయి
 • వృద్ధిచెందిన భూమి నీటి నుండి లభ్ది పొందడానికి, సంరక్షణ చేయబడ్డ ప్రాంతానికి సరిపడినన్ని నూతులు మరియు సాగుచేసే భూమి ఉండాలి.
 • చెరువు కట్ట సామర్ధ్యం మీద పెర్కొలేషన్ ట్యాంక్ యొక్క పరిమాణం నిర్ణయింపబడు తుంది. సామాన్యంగా పెర్కొలేషన్ ట్యాంకులు 0.1 నుండి 0.5 మిలియన్ క్యూబిక్ మీటర్ల (యమ్ సి యమ్) నీటిని నిల్వచేసే సామర్ధ్యం కలవిగా రూపొందించాలి. సాధారణంగా 3 మరియు 4.5 మీటర్ల మధ్య నీటిని నిల్వచేసే సామర్థ్యం అందించేట్టుగా చెరువు రూపొందించబడాలి.
 • పెర్కొలేషన్ ట్యాంకులు సామాన్యంగా ప్రవాహ మార్గం కోసం ఇటుకతో పాటు కట్టిన మట్టి ఆనకట్టలు. భూమిలో నీటి నిలవను సంరక్షణ చేయుటకు మరియు కట్ట యొక్క ఆనకట్ట నుండి నీరు పారేలా వీలు కల్గించడం పెర్కొలేషన్ ట్యాంకు యొక్క ఉద్దేశ్యం. 4.5 మీటర్ల ఎత్తున్న ఆనకట్టలకు, కాలువలకు గండ్లు అవసరం లేదు మరియు ఆనకట్ట కు మరియు భూమికి మధ్య కీయింగ్, బెన్చింగ్ సరిపోతుంది.
v. చెక్ డామ్ లు / సిమెంట్ ప్లగ్ లు/ కాల్వ గట్టులు

 • మామూలు వాలు ఉన్న చిన్న కాలువలపై చెక్ డామ్ లు కడతారు. తక్కువ కాల వ్యవధిలో నిల్వ చేసిన నీటిని భూమిలోకి ఇంకేటట్టు వీలు కల్పించడానికి  ఆనకట్ట ప్రకృతి సహజంగా ఉండేదానిని ఎంచుకోవాలి.  
 • ఈ కట్టడములలో నిల్వ ఉంచిన నీరు ఎక్కువగా సెలయేటి ప్రవాహమునకు వాడతారు. ఎత్తు సాధారణం గా 2 మీటర్ల కన్నా తక్కువే ఉంటుంది. మిగిలిన నీటిని గోడమీదుగా ప్రవహింపజేస్తారు. ఎక్కువ నీటి ఉధృతి వల్ల అరిగిపోకుండా ప్రవాహం క్రింది భాగమున వాటికి నీటి దిండ్లు ఏర్పాటు చేస్తారు.
 • ప్రవాహంలో నీటి ఉధృతికి కళ్ళెము వేయుటకు ప్రాంతీయ అవసరార్ధము అటువంటి కొన్ని చెక్ డాములు వరుసగా నిర్మించవచ్చును.
 • చిన్న నీటి ప్రవాహాలకు అడ్డుకట్ట వేయుటకు మట్టితో నింపిన సిమ్మెంట్ సంచులను గోడగా పేర్చి ఉప యోగిస్తారు. అక్కడక్కడ లోతు తక్కువ ఉన్న కందకాలను, కాల్వకు అడ్డంగా త్రవ్వి దానికి రెండు ప్రక్కల యాస్ బెస్టాస్ రేకులను అమరుస్తారు. రేకుల మధ్య రెండు వరుసలలోని ప్రదేశమును కాల్వ కు అడ్డంగా తిరిగి మట్టితో నింపుతారు. ఆ విధముగా తక్కువ ఖరీదులో చెక్ డామ్ నిర్మించబడును. ఈ రేకుల నిర్మాణము దెబ్బతినకుండా నిశ్చలముగా ఉండుటకు ప్రవాహంపై భాగమున మట్టితో నింపిన సిమ్మెంట్ సంచులను వాలుగా పేరుస్తారు.
 
vi. రిఛార్జి షాఫ్ట్ ( పొరలలో నీటిని పంపించ డం)
 • తక్కువగా చొరబడనిచ్చే పొరలతో ఉన్న, పరిమితి లేని జలమయ శిలాస్తరాల్ని రిఛార్జి చేయడానికి ఇది మిక్కిలి ఉపయోగకరమైన మరియు పొదుపైన విధానం.
 • పొరలు కూలిపోకుండా ఉండే లక్షణాన్ని కలిగి ఉంటే, రిఛార్జి షాఫ్ట్ ని కూలీల చేత త్రవ్వించవచ్చును. ఆ షాఫ్ట్ యొక్క వ్యాసం సాధారణంగా 2 మీటర్లకు మించి ఉండవలెను.
 • షాఫ్ట్,  నీటిని ఎక్కువ చొరబడనిచ్చే పొరలలో, పైన ఉన్న చొరబడనీయని పొరల క్రింది  భాగమున అంతమవ్వవలెను. అది నీటి బల్లను తాకనవసరం లేదు.
 • లైనింగ్ లేని షాఫ్ట్ ని  ముందుగా బండ రాళ్ళతోను ఆ తరువాత గులక రాళ్శతోను, మోటైన ఇసుకతోను నింపవలెను.
 • లైన్ చేసిన షాఫ్ట్ అయితే, రొఛార్జి చేయనలసిన నీటిని ఒక కండక్టర్ పైప్ ద్వారా ఫిల్టర్ ప్యాక్ వరకు అందజేయాలి.
 • తక్కువ లోతులో ఉన్న మట్టి పొరలు నిండియుండి జలమయ శిలాస్తనాలు చేరడానికి నీటిని వడ కట్టుటకు  సహకరించని పల్లెటూరు చెరువులకు, ఈ రిఛార్జి నిర్మాణములు చాలా ఉపయోగం.
 • వానకాలంలో పల్లెటూళ్ళలోని చెరువులు నీటితో పూర్తిగా నిండి ఉంటాయి కాని,  దాని సమీపంలో నున్న త్రవ్విన బావులు మరియు గొట్టపు బావులలో నీరు ఎండిపోవుటవలన  వీటిలోని నీరు బురద మట్టి అడ్డుపడుట వలన క్రిందికి వెళ్ళదు. గ్రామములలోని చెరువులలో ఉన్న నీరు ఉప యోగించుటకు వీలుగాక ఆవిరైపోతాయి.
 • చెరువులలో రిఛార్జి షాఫ్ట్ లు నిర్మించుట ద్వారా, ఎక్కువై పోయిన నీటిని భూమిలో ఉన్న నీటికి పంపవచ్చును. నీటి అందుబాటును బట్టి ఈ రిఛార్జి షాఫ్ట్ లను 0.5 నుండి 3 మీటర్ల వ్యాసం వరకు 10 నుండి 15 మీటర్ల లోతు వరకు నిర్మిస్తారు. షాఫ్ట్ పై భాగము ట్యాంకు బెడ్ లెవెల్ కన్నా పైన ఉండునట్లు ఉంచాలి. ముఖ్యముగా పూర్తి సప్లై  లెవెల్కి సగం ఉండునట్లు ఉంచాలి. వీటిని రాళ్ళతో, గులకరాళ్ళతో, మోటైన ఇసుకతో నింపాలి.
 • ఈ నిర్మాణం పటిష్టముగా ఉండుటకు పైభాగంలో ఉన్న ఒకటి/రెండు మీటర్ల లోతు ఇటుక సిమ్మెంటుతో కట్టించెదరు.
 • ఈ విధానం ద్వారా సప్లై లెవల్ కు 50% దాటి ఆ ఊరి చెరువులో చేరిన నీటిని భూమి నీటిని భూమిలోకి ఇంకేటట్టు చేయవచ్చును. ఆ విధంగా రీచార్జి (భూమిలోకి నీరును ఇంకేటట్టు చేయడం) చేసిన పిమ్మట గృహావసరములకు ఉపయోగించ డానికి సరిపడు నీరు ఆ చెరువులో మిగిలిఉంటుంది.
vii . త్రవ్విన నూతులలో నీటిని నిల్వ చేయడం ద్వారా భూగర్భ జలాల స్థాయి ని పెంచడం

 • ప్రస్తుతం ఉన్న/వదలివేయబడిన నూతులను తగిన విధముగా శుభ్రపరచి క్రింద బురదను తీసివేసి తరువాత వాటిని రిఛార్జి పనికివచ్చే నిర్మాణంగా వాడవచ్చు.
 • రిఛార్జి నీటిని బురదను తీసివేసే చాంబర్ నుండి ఒక పైపు ద్వారా నూతి ఆడుగు భాగమునకు గాని లేదా నీటి మట్టం క్రిందికి గాని పంపుదురు. దీని వలన జలమయ శిలాస్తరాల అడుగు భాగము అరిగి పోకుండా గాలి బుడగలు రాకుండా జరుగును.
 • రిఛార్జి నీరు మురికిలేనిదై ఉండవలెను. ఆ మురికి పదార్థాలను తొలగించుటకు ఆ నీటి ప్రవాహాలను మురికి నిర్మూలించు చాంబర్ ద్వారా గాని/ఫిల్టర్ చాంబర్ ద్వారా గాని పోనివ్వవలెను.
 • బ్యాక్టీరియా వల్ల నీరు చెడిపోకుండా ఉండుటకు అప్పుడప్పుడు క్లోరినేషన్ చేయవలెను.

viii. భూమి నీటి ఆనకట్టలు/ ఉప - ఉపరితల క్రిందగోడలు ద్వారా భూగర్భ జలాల స్థాయి ని పెంచడం

 • ఉప-ఉపరితలం గోడ/భూమి క్రింద ఆనకట్ట అనగా ఉపరితలం క్రింద నీటి ప్రవాహమును తగ్గించడానికి మరియు ఎగువ ప్రవాహములో నీటిని నిల్వ చేసే అడ్డుకట్ట. ఆ విధంగా చేయుటవల్ల భూమి నీటి ఆనకట్టలో ఎగువ ప్రవాహమునకు నీటి స్థాయి పెరిగి ఎండిపోయిన జలమయ శిలాస్తనాలను తడుపు తుంది.
 • బయటకు దారి సన్నగా ఉండే మరియు విశాలమైన లోయతో తక్కువ లోతుగల నీరు క్రిందికి ఇంకి పోనివ్వని పొరఉండే స్థలము ఉపరితలం కింద గోడ నిర్మాణమునకు ప్రతిపాదించాలి.
 • సరియైన స్థలము ఎన్నిక జరిగిన తరువాత , ప్రవాహమునకు అడ్డముగా నీటి క్రింద భాగం వరకు 1-2 మీటర్ల వెడల్పుగల కందకాన్ని తవ్వవలెను. గోతిని, మట్టి లేదా ఇటుక/ కాంక్రిట్ తోగాని భూమి ఉపరితలానికి ½ మీటర్ల క్రిందుగా నింపవచ్చు.
 • అభేద్యముగా నీరు నిల్వ ఉండునట్లు చూచుటకు, 3000 పి యస్ ఐ టేరింగ్ స్ట్రెన్త్ గల పి వి సి షీట్ల ను 400 నుండి 600 గేజ్ లేదా 200 గేజ్ గల తక్కువ సాంద్రత పోలిథిన్ ఫిల్మ్ తో గాని కొట్టిన గోడను కప్పి ఉంచుటకు వాడవచ్చును.
 • జలమయ శిలాస్తనాలలో నీరు నిలవచేసి ఉంచుట వలన, భూభాగం మునిగిపోకుండా తప్పించ వచ్చును మరియు ఆనకట్ట కట్టాక కూడ రిజర్వాయిర్ పై భాగమున ఉన్నభూమిని ఉపయోగించుకొన వచ్చును. రిజర్వాయిర్ లో నీరు ఆవిరైపోవడం గాని, అడుగుభాగమున ఒండ్రు మట్టి పేరుకుపోవడం గాని కాదు. ఆనకట్ట కూలిపోవుట వంటి ఘోర ప్రమాదం కూడా దీనివల్ల తప్పించవచ్చును.

పట్టణ ప్రాంతాలలో భూగర్భ జలాల స్థాయి ని పెంచడం ని తరువాత పోస్ట్ ని చూడండి !
మనము తెలుసుకోవాల్సినవి ఇవి అందుకే పోస్ట్ చేశాను. - భారతీయులం


--

0 comments:

Post a Comment

పాఠకులందరికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు.ఇట్లు - భారతీయులం