pattana pranthallo neeruni vaananeetini kaapudukovatam ela chitralatho telusukovadam kosam

భూమిలో నీరు నిల్వచేసేందుకు వాననీటి సంరక్షణా పద్ధతులు

అరుదైన మంచినీరు

  • భూమి మీద మొత్తం నీటిలో 3% మాత్రమే మంచి నీరు. మిగతా నీరంతా మహా సముద్రాలలోని ఉప్పు నీరు.
  • 800 మీటర్ల లోతు వరకు భూమి లోపల మంచి నీరు 11% వరకు లభ్యమగును, వాడకానికి రాబట్టు కొనవచ్చును.
  • ప్రకృతిలో దొరికే అతి మూల్యమైన, అతి తక్కువ పరిమాణంలో దొరికే ఈ ప్రకృతి వనరు తెలివి తక్కువ తనంతో రాబట్టుకోవటం మరియు స్వలాభార్జన వలన, దాని నాణ్యత మరియు పరిమాణము రెండింటి లోను వేగంగా క్షీణత మరియు గుణము చెడుట వంటి లక్షణములు సంభవించినవి.

పట్టణ ప్రదేశాలు: ఇంటి పై కప్పు మీద వాన నీటిని వీటి ద్వారా సంగ్రహించవచ్చు

  • రిఛార్జి గొయ్యి   
  • రిఛార్జి కందకము
  • గొట్టపుబావి  
  • రిఛార్జి బావి
పట్టణ ప్రాంతాలలో భూగర్భ జలాల స్థాయి ని పెంచడం

పట్టణ ప్రాంతాలలో, భవనములపై నుంచి, చదునుచేయబడ్డ మరియు చేయబడని ప్రాంతములలోను కురిసిన వర్షపు నీరు వృధా అవుతుంది. ఈ నీటిని అవసరము వచ్చినపుడు లాభదాయకంగా వాడుకొనుటకు జల మయ శిలాస్తనాలలో  మళ్ళించవచ్చును. వర్షపునీటిని నిలువచేయు పద్ధతిలో, నీటిని సేకరించుటకు మరియు రిఛార్జి సిస్టమ్ కి ఎక్కువ స్థలం ఆక్రమించకుండా నిర్మించాలి. పట్టణ ప్రాంతములలో, భవనములపై నుండి పడు వర్షపునీటిని నిలువచేసి ఉపయోగించుకనే కొన్ని పద్ధతులు ఈ క్రింద వివరించ బడినవి.

i. గొయ్యి ద్వారా భూగర్భ జలాల స్థాయిని పెంచడం

  • నీటిని చొరబడనిచ్చే బండరాళ్ళు భూమి మీద లేక తక్కువ లోతులో కనిపించే ఒండ్రుమట్టి గల ప్రాంతములలో, రిఛార్జి గోతుల ద్వారా వర్షపునీటిని నిల్వ చేసి ఉపయోగింపవచ్చును.
  • ఈ విధానం, 100 చదరపు మీటర్ల వైశాల్యం గల పై కప్పు ఉన్న భవనాలకు అనువుగా ఉంటుంది. తక్కువ లోతులో ఉన్న జలమయ శిలాస్తనాలని రిఛార్జి చేయుటకు ఇవి నిర్మించబడతాయి.
  • రిఛార్జి గుంటలు ఎలాంటి ఆకారంలోగాని, పరిమాణంలో గాని ఉండవచ్చు. అవి సాధారణంగా 1 నుండి 2 మీటర్ల వెడల్పు మరియు 2 నుండి 3 మీటర్ల లోతులో నిర్మింపడును. ఈ గుంటలు, (5-20 సెంటి మీటర్లు) బండరాళ్ళు, కంకర ( 5 – 10 మిల్లీ మీటర్లు) మరియు మోటైన ఇసుక (15 – 2 మిల్లీ మీటర్లు) లతో వరుసగా నింపబడును. ప్రవహించే నీటితోపాటు వచ్చే ఒండ్రు మట్టి మోటైన ఇసుక పొరమీద పేరుకుపోయి సులభంగా తీయడానికి అట్టడుగున బండరాళ్ళు వాటి పైన కంకర, వాటిపై మోటైన ఇసుకని అమర్చవలెను. చిన్న పైకప్పు గల వైశాల్యంలో, ఇటుక ముక్కలతో/గులక రాళ్ళతో గొయ్యిని నింపవచ్చును.
  • రిఛార్జి గుంటపైన ఆకులు గాని ఇతర గట్టి చెత్తగాని పడకుండా గుంటపైన ఒక మెష్ ను ఏర్పాటు చేయ వలెను. చిన్న అణువులు కందకంలోనికి ప్రవహించకుండా నేల మీద, ఒండ్రుమట్టిని తీసే/సేకరించే ఛాంబర్ని కూడా ఏర్పాటు చేయాలి.
  • రిచార్జ్ రేటు అలాగనే ఉండడానికి ఇసుక పై పొరని కొంతకాలమునకొకసారి శుభ్రం చేయాలి.
  • మొదటి వానని ప్రవేశ పెట్టకుండా ఉండడానికి సేకరించే ఛాంబర్ ముందు వేరే ఏర్పాటుని ఉంచాలి.

ii. కందకము ద్వారా భూగర్భ జలాల స్థాయి ని పెంచడం
  • తక్కువ లోతులలో ఉండే చొరబడనిచ్చే పొరలలో మరియు 200-300 చదరపు మీటర్లు పైకప్పు వైశాల్యం ఉన్న బిల్డింగులు రిఛార్జ్ కందకాలకి అనువుగా ఉంటాయి. 
  • రిచార్జ్ చేయడానికి దొరికే నీటిని బట్టి, 0.5 నుండి 1 మీటరు వెడల్పు, 1 నుండి 1.5 మీటరు లోతు మరియు 10 నుండి 20 మీటర్లు పొడువుగల కందకాన్ని చేయవచ్చు.
  • వీటిని పెద్ద రాళ్ళు ( 5-20 సెంటీ మీటర్లు), కంకర ( 5-10 మిల్లీ మీటర్లు) మరియు మోటైన ఇసుకతో ఒక వరుసలో తిరిగినింపాలి. ప్రవాహంతో పాటు వచ్చే ఒండ్రుమట్టి ఇసుక పొరపై మోటైన ఇసుకగా పేరుకుని, సులువుగా తీసివేయడానికి, పెద్దరాళ్ళని క్రింద, కంకరని మధ్యలో మరియు మోటైన ఇసుకని పైన వేయాలి.
  • ఆకులు లేదా ఏదైన ఇతర గట్టి చెత్త, కందకంలోనికి రాకుండా చేయడానికి పైకప్పు పై వలని ఏర్పాటు చేయాలి. చిన్న అణువులు కందకంలోనికి ప్రవహించకుండా నేల మీద, ఒండ్రుమట్టిని తీసే/సేకరించే ఛాంబర్ని కూడా ఏర్పాటు చేయాలి.
  • మొదటి వానని ప్రవేశ పెట్టకుండా ఉండడానికి సేకరించే ఛాంబర్ ముందు వేరే ఏర్పాటుని ఉంచాలి. రిచార్జ్ రేటు ఉండడానికి ఇసుక పై పొరని కొంతకాలమునకొకసారి శుభ్రం చేయాలి.

iii. గొట్టపు బావులు ద్వారా భూగర్భ జలాల స్థాయి ని పెంచడం
  • తక్కువ లోతులో ఉన్న జలమయ  శిలాస్తరాలు ఎండిపోయిన ప్రదేశాలలో మరియు లోతుఉన్న జలమయ  శిలాస్తరాల నుంచి ప్రస్తుతంఉన్న గొట్టపుబావులు నీరుతీసే ప్రదేశాలలో, లోతైన జతైన జలమయ శిలాస్తరాలని రిఛార్జ్ చేయడానికి వర్షపు నీటిని సేకరించడం ప్రస్తుతం ఉన్న గొట్టపు బావుల ద్వారా అవలంబించవచ్చు.
  • వర్షపు నీటిని సేకరించడానికి, పైకప్పు మోరీలను 10 సెంటిమీటర్ల వ్యాసము గల పివిసి పైపులతో కలపాలి. మొదటిసారి పైకప్పు నుండి వచ్చే ప్రవాహాన్ని మోరీ పైపు క్రిందనుండి వదలి వేయాలి. పైపు అడుగు భాగాన్ని మూసిన తరువాత, 'టి' నుండి  ఆన్ లైన్ పి వి సి ఫిల్టర్ ద్వారా తరువాత వచ్చే వర్షపు నీటిని సేకరిస్తారు. నీరు, గొట్టపు బావులను ప్రవేశించే ముందు వడపోతని పెట్టవచ్చు. వడపోత 1-1.2 మీటర్ల పొడవు ఉండి  పి వి సి పైపుతో తయారు చేస్తారు. దీని వ్యాసము పైకప్పు వైశాల్యాన్ని బట్టి మారుతూ ఉంటుంది, పైకప్పు వైశాల్యం 150 చదరపు మీటర్ల కన్నా తక్కువ ఉంటే 15 సెంటిమీటర్లు మరియు  పైకప్పు వైశాల్యం అంత కన్నా ఎక్కువ ఉంటే 20 సెంటిమీటర్లు ఉండాలి. వడపోతకి ఇరువైపు లా 6.25 సెంటిమీటర్ల రెడ్యూసర్ని పెట్టాలి. వడపోత మెటీరియల్  కలసిపోకుండా ఉండడానికి, పి వి సి స్కీన్లతో వడపోత మూడు ఛాంబర్లు గా విభజించబడి ఉంటుంది. మొదటి ఛాంబర్  కంకర( 6-10 మిల్లీ మీటర్లు)తో, మధ్య ఛాంబర్ గులక రాళ్ళ (20-40 మిల్లీ మీటర్లు)తో మరియు చివరి ఛాంబర్ పెద్ద గులక రాళ్ళ (12-20 మిల్లీ మీటర్లు) తో నిండి ఉంటుంది.
  • పైకప్పు వైశాల్యం ఎక్కువ ఉంటే, వడపోత గొయ్యిని ఏర్పాటు చేయాలి. నేల మీద ఉన్న ఒండ్రు మట్టిని తీసే/సేకరించే ఛాంబర్ లోనికి పైకప్పు నుండి వర్షపు నీరు తీసుకోబడుతుంది. 1:15 వాటంతో ఈ సేకరించే ఛాంబర్లు పైపుల ద్వారా ఈ ఛాంబర్లు ఒకదానికొకటి మరియు వడపోత గొయ్యికి కలపబడతాయి. లభ్య మయ్యే ప్రవాహాన్ని బట్టి వడపోత గొయ్యి ఆకారము, పరిమాణము మారుతూ ఉంటుంది మరియు మారుతున్న మందముతో (0.30-0.50 మీటర్లు) అట్టడుగున బండరాళ్ళు, మధ్యన కంకర, వాటిపై ఇసుక వంటి గ్రేడెడ్ మెటీరియల్తో తిరిగి నింపుతారు మరియు స్క్రీన్ తో విభజించవచ్చు. గొయ్యిని రెండు  ఛాంబర్లుగా విభజించి, ఒక ఛాంబర్లో వడపోత మెటీరియల్తోను మరియు అధికమైన వడపోతసిన నీటిని ఇముడ్చుకోడానికి మరియు వడపోసిన నీటి నాణ్యతని చూడడానికి వేరొక  ఛాంబర్ని ఖాళీగా ఉంచు తారు. వడపోసిన నీటిని బావుల ద్వారా రిఛార్జ్ చేయడానికి, గొయ్యి అడుగున రిఛార్జ్ బావిని కలిపే పైపుని అమరుస్తారు.

iv. బావి , కందకము ద్వారా భూగర్భ జలాల స్థాయి ని పెంచడం
  • చొరబడనీయని ఉపరితల మట్టిలో మరియు పెద్దవర్షము వచ్చిన అతి తక్కువ వ్యవధిలో పెద్దమొత్తం లో పైకప్పు నీరు లేదా  ఉపరితల ప్రవాహం లభ్యమయ్యే ప్రదేశాలలో, వడపోత మాధ్యము ద్వారా నిల్వచేయడానికి, కందకము/గొయ్యిల ను ఉపయోగించేలా చేయాలి. ఆ తరువాత ప్రత్యేకంగా నిర్మించి న రిఛార్జ్ బావుల ద్వారా భూనీటికి రిఛార్జ్  చేయాలి.
  • నేల నుండి క్రింద మూడు మీటర్ల క్రింద నున్న చొరబడనిచ్చే దిగ్మండలం ఉన్న ప్రాంతాలలో ఈ పద్దతి అనుకూలంగా ఉంటుంది.
  • వాటి స్థాయి నుండి కనీసం 3 నుండి 5 మీటర్ల లోతులలో 100-300 వ్యాసము గల రిఛార్జ్ బావి నిర్మించబడింది. ఆ ప్రాంతపు రాతి వివరములను బట్టి, తక్కువ మరియు లోతు ఎక్కువ ఉన్న జలమయ శిలాస్తులను పైన గాడి పెట్టిన పైపుతో బావి ఎస్సెంబ్లీని డిజైన్ చేస్తారు.
  • లభ్యమయ్యే నీటిని, మరియు స్థానిక విలువైన చొరబడనిచ్చే రాళ్ళని బట్టి కందకంలో ఎన్ని రిఛార్జ్ బావులు ఉండాలన్నిది నిర్ణయించబడుతుంది.
  • రిఛార్జ్ బావులకి వడపోత మాధ్యముగా పని చేయడానికి పెద్దరాళ్ళ, కంకర మరియు మోటైన ఇసుకలని కందకంలో తిరిగి నింపుతారు.
  • 20 మీటర్ల కన్నా లోతులో జలమయ శిలాస్తరాలు ఉంటే 2 నుండి 5 మీటర్ల వ్యాసము మరియు 3-5 మీటర్ల లోతుగల చిన్న షాఫ్ట్ ని లభ్యమయ్యే ప్రవాహాల్ని నిర్మించవచ్చు. లోతైన జలమయ శిలాస్తరాలని, లభ్యమయ్యే నీటితో రిఛార్జ్ చేయడానికి షాఫ్ట్ లోపల 100-300 మిల్లీమీటర్ల రిఛార్జ్ బావి నిర్మింపబడుతుంది. రిఛార్జ్ బావికి అడ్డు పడకుండా ఉండడానికి వడపోత మాధ్యమాన్ని షాఫ్ట్ క్రింద భాగంలో ఏర్పాటు చేయబడుతుంది.

మనము తెలుసుకోవాల్సినవి ఇవి అందుకే పోస్ట్ చేశాను. - భారతీయులం.

--

0 comments:

Post a Comment

పాఠకులందరికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు.ఇట్లు - భారతీయులం