USB ante enti telusa meeku

image

యుఎస్‌బి(USB)  అంటే యూనివర్శల్ సీరియల్ బస్(Universal Serial Bus) or కంప్యూటర్ పారిభాషికంలో చెప్పుకోవాలంటే -పోర్టబుల్ యుఎస్‌బి ఫ్లాష్ మెమరీ డివైస్.రూపంలో పెన్ మాదిరిగా జేబులో ఇమిడిపోయే పరికరం కనుక -ఇప్పటి వరకూ యుఎస్‌బిని పెన్‌డ్రైవ్(USB PENDRIVE) అని ముద్దుగా పిలుచుకున్నాం.యుఎస్‌బి

యూనివర్షల్‌ సీరియల్‌ బస్‌ (యుఎస్‌బి) పిసికి ఇతర ఉపకరణాలను కలుపుకొనేందుకు వీలు కల్పించేందుకు ఫోర్ట్‌.

యుఎస్‌బి పోర్టు వచ్చాక పీసీలతో జోడించే ఉపకరణాల సంఖ్య పెరగడమే కాదు, ఎలాంటి ఉపకరణాన్ని అయనా పీసీకి కనెక్టు చేసుకోగలగడం సాధ్యమైంది. యుఎస్‌బి పోర్టు ద్వారా నేడు వౌస్ నుంచీ స్కానర్ దాకా, డిజిటల్ కెమెరా నుంచి లేజర్ ప్రింటర్ దాకా - అన్నిటినీ కనెక్ట్ చేసి వాడుకోగలుగుతున్నాం!

ఈ యుఎస్‌బి పోర్టులనేవి అటు విండోస్, మ్యాక్ ఆపరేటింగ్ సిస్టంలలోనే కాదు. ఇటు లినక్స్ ఆపరేటింగ్ సిస్టంలో కూడా సమర్థవంతంగా పనిచేస్తోంది. పాతకాలం సీరియల్ పోర్టులపై పనిచేసిన మోడెమ్‌లు నేడు యుఎస్‌బి పోర్టుల ద్వారా ఎంతో మెరుగైన వేగాన్ని అందిస్తున్నాయి కూడా. ఈ యుఎస్‌బి పోర్టుల ద్వారా మనం ఒక వౌస్‌ను కనెక్టు చేసినా, మెమరీ స్టిక్‌ను కనెక్ట్ చేసినా ఆ ఉపకరణాన్ని ఇట్టే గుర్తించి, దాని తాలూకు డివైజ్ డ్రైవర్‌ను ఆటోమేటిగ్గా పనిచేసేలా విండోస్, లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్‌లు ఉన్నాయి.

యుఎస్‌బి వర్షన్ (USB VERSIONS) :

1.యుఎస్‌బి తొలి వర్షన్ 1996లో వచ్చింది. ఈ USB1.0 ప్రమాణాలు 1.5 Mbps డేటా బదిలీ రేటు కలిగి ఉండేవి

2.USB1.1 ప్రమాణాలు 2 డేటా బదిలీ రేటుతో వచ్చింది. 1.5 Mbps వేగంతో జాయ్ స్టిక్స్‌లాంటి ఉపకరణాలకు అనుగుణంగా పనిచేసేలాగానూ, హెచ్చువేగంతో పనిచేసే హార్డ్‌డిస్క్‌ల కోసం 12Mbps వేగంతోనూ USB 1.1 ప్రమాణాలు వీలునిచ్చాయి.

3.2002లో USB 2.0 ప్రమాణాలు అమలులోకి వచ్చాయి. దీనే్న హైస్పీడ్ USB 2.0 ప్రమాణాలన్నారు. ఇది USB 1.1 ప్రమాణాల కన్నా 40 రెట్లు హెచ్చువేగాన్ని పొందే వీలునిచ్చింది. ఒక ఉపకరణాన్ని పీసీకి కలిపాక, 480 Mbps డేటా రేటునిస్తుంది USB 2.0. డిజిటల్ కెమెరాలు, సిడి రైటర్లు, వీడియో ఉపకరణాలు ఈ పోర్టు ద్వారా హాయిగా పనిచేస్తాయి. USB 2.0 విండోస్-ఎక్స్‌పి(Windows-XP) సపోర్టు కూడా ఉంది.

Note: మనం హెచ్చుస్పీడులో పనిచేయగల మెమరీ స్టిక్‌ను తక్కువ స్పీడు (ఉదా. USB1.1) పోర్టులో పెడితే, విండోస్ మెసేజీ ఒకటి రావడం మనం చూస్తుంటాం. ఇది హైస్పీడు USB పోర్టులో పెడితే ఇంకా వేగంగా పనిచేస్తుందని ఆ మెసేజీ సారాంశం

4.ఈ USB 2.0 ప్రమాణాల తర్వాత USB OTG ప్రమాణాలు కూడా వచ్చాయి. OTG అంటే, ఆన్-ద-గో (USB On-The-Go)అని అర్థం. దీనిద్వారా రెండు USB ఉపకరణాలను నేరుగా (పీసీతో ప్రమేయం లేకుండా) కలుపుకొనే వీలు ఏర్పడింది.

5.యుఎస్‌బి ఉకపరణాలను వాడాలీ అంటే మన పీసీలలో బిల్టిన్ USB ఉండాలి. లేదా ఒక USB ఎక్స్‌పాన్షన్ కార్డ్ ఇన్‌స్టాల్ అయ్యి ఉండాలి. సూపర్‌స్పీడ్ USB వల్ల ఉపకరణాలు ఎంతో సమర్థవంతంగా పనిచేస్తాయి. అవే USB 3.0 ప్రమాణాలుగా రానున్నాయి. ఇవి మరింత మెరుగైన వేగాన్ని అందిస్తాయి. ఈ సూపర్ USB ప్రమాణాలు 5Gbps డేటా రేటునిస్తున్నాయి. ఇవి యూజర్ వెయిట్ టైమ్‌ను గణనీయంగా తగ్గించనున్నాయి.

0 comments:

Post a Comment

పాఠకులందరికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు.ఇట్లు - భారతీయులం