atyachaara nirodhaka billuku loksabha aamodam

అత్యాచార నిరోధక బిల్లుకు లోక్‌సభ ఆమోదం
అత్యాచార నిరోధక బిల్లుకు మార్చి 19న లోక్‌సభ ఆమోదం తెలిపింది. 'క్రిమినల్ చట్టాల సవరణ బిల్లు -2013' పేరుతో ఈ బిల్లును తీసుకువచ్చారు. ఈ బిల్లు ప్రకారం అత్యాచారాలు, సామూహిక అత్యాచారాలకు పాల్పడితే దోషికి కనీసం 20 ఏళ్ల జైలుశిక్ష, అవసరమైతే చనిపోయేంత వరకు జైలుశిక్ష విధిస్తారు. రెండోసారి అదే నేరానికి పాల్పడితే మరణశిక్ష విధిస్తారు. పరస్పర ఆమోదంతో శంగారానికి వయోపరిమితిని 18 ఏళ్లుగా నిర్ణయించారు. మహిళలను వెంటాడటం, శంగారంలో ఉన్న వారిని చూడటం వంటి వాటిని శిక్షార్హమైన నేరాలుగా ప్రకటించారు. యాసిడ్ దాడులకు పాల్పడితే 10 సంవత్సరాల జైలు శిక్ష వంటివి బిల్లులోని ప్రధానాంశాలు.

--

0 comments:

Post a Comment

పాఠకులందరికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు.ఇట్లు - భారతీయులం