sontha site ku sogasu ilaa..సొంత సైటుకి సొగసులిలా..!

సొంత సైటుకి సొగసులిలా..!
ఉద్యోగి... వ్యాపారి... విద్యార్థి! కాస్త టెక్నాలజీ పరిచయం ఉంటే చాలు... నాకూ ఓ సైటుంటే? అన్న ఆలోచనే!
అందుకు ఉచిత వేదికలు ఉన్నాయని తెలుసా?
చిత సైట్‌లను అందించే సైట్‌లు ఇప్పటికే చాలానే ఉన్నా, మరిన్ని హంగులతో సరికొత్త వెబ్‌ సర్వీసులు అందుబాటులోకి వస్తూనే ఉన్నాయి. వాటితో మీరే సొంత సైట్‌ని రూపొందించుకోవచ్చు. అందుకు అనువైన మార్గాలేంటో వివరంగా చూద్దాం!దానికి ప్రత్యేకం!
మీ అభిరుచికి తగినట్టుగా మీ వెబ్‌సైట్‌ హోంపేజిని ఉచితంగా రూపొందించుకోవాలంటే ఒక సాధనంAbout.Me. లాగిన్‌ అయి మీకు నచ్చిన ఫొటోని అప్‌లోడ్‌ చేశాక, Biographyలోకి వెళ్లి మీ వివరాలను నమోదు చేయవచ్చు. ఏవైనా వెబ్‌ లింక్‌లను పేజీకి యాడ్‌ చేయాలంటే 'లింక్స్‌' ఉంది. సెట్టింగ్స్‌ ద్వారా నచ్చిన సోషల్‌ నెట్‌వర్క్‌లను అనుసంధానం చేసి మీ సైటును షేర్‌ చేసుకోవచ్చు. ఇతర వెబ్‌ అప్లికేషన్స్‌ కోసం Appsఉంది. ఐకాన్ల రూపంలో అప్లికేషన్లు కనిపిస్తాయి. ఉదాహరణకు మీరు బ్లాగింగ్‌ ప్రియులైతే 'బ్లాగర్‌' సర్వీసుని పేజీలో పెట్టుకునే వీలుంది. ఇతరుల పేజీలను చూడాలనుకుంటే 'ఎక్స్‌ప్లోర్‌ పేజెస్‌' ఉంది. ప్రత్యేక వెబ్‌ లింక్‌తో మీ పేజీని ఎక్కడైనా షేర్‌ చేయవచ్చు. http://about.me
వర్చువల్‌ విజిటింగ్‌ కార్డ్‌
చదువు, ఉద్యోగం, అనుభవం... లాంటి వివరాలతో వర్చువల్‌ విజిటింగ్‌ కార్డ్‌ని తయారు చేసి మిమ్మల్ని మీరు వైవిధ్యంగా పరిచయం చేసుకోవాలంటే Follr వెబ్‌ సర్వీసు ఉంది. మీ గురించి తెలియజేసే మిని వెబ్‌సైట్‌ అన్నమాట. మీ సోషల్‌ లైఫ్‌ని ఒకే పేజీ నుంచి మేనేజ్‌ చేసుకోవచ్చు. అన్ని సోషల్‌ నెట్‌వర్క్‌లు, వీడియో షేరింగ్‌ సైట్‌లను ఒకే చోట పొందుపరచొచ్చు. నెట్‌వర్క్‌గా ఏర్పడి మిత్రుల అప్‌డేట్స్‌ని తెలుసుకునే వీలుంది. వాడుతున్న ఇతర వెబ్‌ సర్వీసుల నుంచి కాంటాక్ట్స్‌ని సులభంగా యాక్సెస్‌ చేయవచ్చు. ప్రత్యేక వెబ్‌లింక్‌ని క్రియేట్‌ చేసిన సైట్‌ని ఎక్కడైనా పొందే వీలుంది. http://follr.com
ఇది మరోటి
చక్కని ఫొటో, ఇతర విజువల్‌ ఎఫెక్ట్‌లతో సైట్‌ని క్రియేట్‌ చేసుకోవాలంటే Dooid ఉంది. ఇదో సోషల్‌ మీడియా ప్రొఫైల్‌. మొబైల్‌, ట్యాబ్‌, పీసీలకు అనువుగా రూపొందించుకోవచ్చు. మీరేదైనా కంపెనీ నడుపుతుంటే అందుకు కావాల్సిన సైట్‌ని 'కంపెనీ సైట్‌' విభాగంలోకి వెళ్లి రూపొందించుకోవచ్చు. 'ఈవెంట్‌ సైట్‌'లను కూడా క్రియేట్‌ చేయవచ్చు. http://dooid.meఫ్రొఫెషనల్‌గానే!
సోషల్‌ ఫ్రొఫైల్‌ మాదిరిగా కాకుండా పూర్తిస్థాయిలో వెబ్‌సైట్‌ని రూపొందించాలనుకుంటే Weebly ఉంది. డ్రాగ్‌ అండ్‌ డ్రాప్‌ పద్ధతిలో సైట్‌ని రూపొందించొచ్చు. ఆకట్టుకునే థీమ్స్‌ ఉన్నాయి. ప్రకటనలకు చోటు కేటాయించి ఆదాయాన్ని ఆర్జించేందుకు వీలుంది. బ్లాగింగ్‌, ఫొరమ్స్‌తో అనుసంధానం కావచ్చు. ఫొటో గ్యాలరీలు ఏర్పాటు చేసుకునే వీలుంది. వీడియోలను అప్‌లోడ్‌ చేసే వీలుంది. www.weebly.com
'ఫ్లేవర్స్‌' ఉండాల్సిందే!
వెబ్‌సైట్‌కి మరిన్ని హంగుల్ని అద్దాలంటే Flavors.Meలోకి వెళ్లాల్సిందే. 17 లేఅవుట్‌ డిజైన్లు ఉన్నాయి. 222 ఫాంట్‌ స్త్టెల్స్‌ ఉన్నాయి. సుమారు 35 రకాల వెబ్‌ సర్వీసుల్ని సైట్‌ నుంచే యాక్సెస్‌ చేయవచ్చు. సోషల్‌ మీడియా కంటెంట్‌ని సైట్‌ నుంచే షేర్‌ చేయవచ్చు. ప్రీమియం వెర్షన్‌ ద్వారా మొబైల్‌ ఫార్మెట్‌లోనూ సైట్‌ని క్రియేట్‌ చేసుకోవచ్చు. కావాల్సిన డొమైన్‌ నేమ్‌ని కొనుగోలు చేసి సైట్‌ని పూర్తిస్థాయిలో నిర్వహించుకోవచ్చు. వెబ్‌సైట్‌ ట్రాఫిక్‌ని తెలుసుకోవచ్చు. https://flavors.me
బిజినెస్‌ సైట్‌ కావాలా?
నిమిషాల్లో మీ వ్యాపారానికి సంబంధించిన సైట్‌ని ఏర్పాటు చేసుకోవాలంటే Yola లోకి లాగిన్‌ అయితే సరి. లేఅవుట్స్‌, విడ్జెట్స్‌ని బ్రౌజ్‌ చేసి సైట్‌కి పొందుపరచొచ్చు. www.yola.com
ఆకట్టుకునే టెంప్లెట్స్‌తో సైట్‌ని క్రియేట్‌ చేసుకోవాలంటే WIX ఉంది. ప్రత్యేక యాడ్‌ఆన్స్‌తో అదనపు వెబ్‌ సర్వీసుల్ని సైట్‌లో పెట్టుకోవచ్చు.www.wix.comఇలాంటిదే మరోటి ZOHO. వివిధ రకాల టెంప్లెట్స్‌తోనే కాకుండా embedding కోడ్‌తో అదనపు సర్వీసుల్ని సైట్‌కి పొందుపరచొచ్చు.www.zoho.com/sites/
మొబైల్‌ ఫార్మెట్‌లో సైట్‌ని రూపొందించుకోవాలనుకుంటే Octomobi ఉంది. అన్ని స్మార్ట్‌ మొబైల్స్‌కీ అనువుగా ఉంటుంది. www.octo mobi.com
ఇలాంటిదే మరోటి Onbile. మల్టిపుల్‌ పేజీలతో సైట్‌ని రూపొందించడం దీంట్లోని ప్రత్యేకత. ఇమేజ్‌ గ్యాలరీలను కూడా క్రియేట్‌ చేయవచ్చు.ww.onbile.com

భారతీయులం” |.:: bharatiyulam.blogspot.in ::. | "Facebook| "Twitter"

0 comments:

Post a Comment

పాఠకులందరికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు.ఇట్లు - భారతీయులం