create a blog in telugu step by step with images Ten Steps to a New Blog

బ్లాగ్ క్రియేట్ చేయడం ఎలా ? 
మీరు బ్లాగ్ రాయాలని అనుకుంటున్నారా ? అసలు ఎలా మొదలు పెట్టాలో తెలియదా ... ఐతే ఇది మీకు ఉపయోగ పడవచ్చు.
వివరంగా బ్లాగ్ ఎలా చేయాలో చెప్తున్నాను !
బ్లాగ్ ఇది ఒక ఆన్ లైన్ సర్వీస్, గూగుల్ వారిది మనము చేసిన మరియు రాసిన బ్లాగ్స్ ని వారు ప్రచురిస్తారు.
ఇందుకోసం మనకు కావాల్సింది జిమెయిల్ ఎకౌంటు చాలు.
పది మెట్లు మన బ్లాగ్ చేయడం కోసం...ఐదు నిమిషాల పని.
మొదటి మెట్టు
మీ నావిగేట్ లో బ్లాగర్.కాం అని టైపు చేయండి.

రెండవ మెట్టు 

మీకు జిమెయిల్ ఎకౌంటు ఉంటె ఆ వివరాలతో లాగిన్ Sign in అవ్వండి ! లేదా కొత్త ఎకౌంటు సృష్టించండి. signup 

లేదా గెట్ స్టార్ టెడ్  తో.

మూడవ మెట్టు 
మీరు మీ పేరు మరియు (డిస్ప్లే నేమ్) ఏ పేరు కనిపించాలో మీ బ్లాగ్ లో, 
లాగిన్ అయ్యే టప్పుడు ఈ పేరుని వాడుతుంది బ్లాగర్.

నాలుగవ మెట్టు 

మీరు ఎ బ్లాగ్ సృష్టించలేదు కాబట్టి...కొత్త బ్లాగ్ ని సృష్టించు ఇప్పుడు ని క్లిక్ (Create your blog now) చేయండి.
ఐదవ మెట్టు 
మీ బ్లాగ్ పేరుని టైటిల్ లో టైపు చేయండి తరువాత బ్లాగ్ అడ్రస్ లో మీరు అనుకున్న పేరుని టైపు చేసి చెక్ అవైలబిలిటి  ని క్లిక్ చేయండి.అవైలబిలిటి లో మనము అనుకున్న పేరుని ఎవరన్నా ఉపయోగిస్తున్నారా లేదా అనేది తెలుస్తుంది. తరువాత కంటిన్యూ అని క్లిక్ చేయండి.
ఉదాహరణకు: 
టైటిల్: భారతీయులం మరియు 
బ్లాగ్ అడ్రస్: bharatiyulam మొత్తం యుఆర్ఎల్ ఇలా ఉంటుంది: http://bharatiyulam.blogspot.com 


ఆరవ మెట్టు 

క్రియేట్ చేయడానికి ఇచ్చిన వార్డ్ వెరిఫికేషన్ ని టైపు చేసి కంటిన్యూ అనండి.
ఏడవ మెట్టు 

మీకు నచ్చిన టెంప్లేట్ ని ఎంచుకోండి...ఇది ఎప్పుడైనా మార్చుకోవచ్చు మనము ఒకదాని నుంచి మరొకదానికి.

ఎనిమదవ మెట్టు 

ఇప్పుడు స్టార్ట్ బ్లాగ్గింగ్ ని క్లిక్ చేయండి..అంతే.

తొమ్మిదవ మెట్టు 

ఇప్పటి నుంచి మీరు కొత్త పోస్ట్ లను రాయచ్చు లేదా ఎడిట్ చేయచ్చు ఇంకేదైనా.....కొత్త పోస్ట్ కోసం న్యూ పోస్ట్ ని క్లిక్ చేయండి.


పదవ మెట్టు 

మీ పోస్ట్ యొక్క టైటిల్ ని టైపు చేయండి.
మీరు ఎం రాయలనుకున్నారో అది కంపోస్ లో రాయండి..ఒక వేల మీకు html వస్తే మీకు నచ్చిన కోడ్ ని ఉపయోగించవచ్చు.


పోస్ట్ ఆప్షన్స్ లో కామెంట్స్ స్వీకరించాలా వొద్దా అనేవి ఉంటాయి.


చివరిగా ఇప్పుడు మీరు రాసిన దానిని పబ్లిష్ చేయచ్చు లేదా డ్రాఫ్ట్స్ లో ఉంచడం కోసం సేవ్ నౌ ని క్లిక్ చేసి తరువాత మల్లి ఏదన్నా ఎడిట్ చేసే ఉద్దేశం ఉంటె చేసి పబ్లిష్ చేయచ్చు.
మీరు రాసింది ఎలా వస్తుంది అని చుసుకోవడానికోసం ప్రివ్యూ ని క్లిక్ చేస్తే చాలు.


అంతే ! మీరు పబ్లిష్ చేయగానే మీ బ్లాగ్ లో మొదటి పోస్ట్ పబ్లిష్ అవుతుంది.
చాలా సులబంగా ఉంది కదా...పది స్టెప్స్ తో బ్లాగ్ క్రియేట్ చేయచ్చు.

మిగతా సెట్టింగ్స్

మీరు మీ డిసైన్ టెంప్లేట్ ని మార్చాలి అనుకుంటే Design క్లిక్ చేసి మార్చుకోవచ్చు.


మరియు ఏదన్నా కోడ్ లను మీరు మీ బ్లాగ్ లో పెట్టాలను కుంటే పక్కన కాని లేదా పైన ..... పేజి ఎలిమెంట్స్ ని క్లిక్ చేసి యాడ్ ఎ గ్యాడ్జేట్ ని క్లిక్ చేసి html / java  తో చేయచ్చు.


మనము రాసే బ్లాగ్ ని ఎవరెవరు చూడచ్చు మరియు వచ్చిన కామెంట్స్ వివరాలు ఇలాంటివి అన్ని సెట్టింగ్స్ లో ఉంటాయి.


మనము రాసే బ్లాగ్ కి ఈమెయిలు ద్వారా కూడా పోస్ట్ చేయచ్చు సులువుగా. మనము ఈమెయిలు ఐడి కి ఈమెయిలు పంప గానే అది ప్రచురిస్తుంది. పోస్ట్ కోసం మనము పై విదంగా చేయనవసరం లేకుండా !


ఇప్పుడు మీ బ్లాగ్ ప్రచురించేసారు మీరు.
మీకు నచ్చిన విదంగా రాయండి ! స్వేచ్చగా. !

మీకేమైనా సందేహం ఉంటె ఈమెయిలు పంపండి నాకు.
bharatiyulam@gmail.com  - m&k

2 comments

  1. screenshots are too old. try to post the latest screenshots

    ReplyDelete
  2. Yes Dear Dare2write this is for the beginners in a basic version...even in latest we can retrieve to old version isn't it.
    i am making the latest one too...i will post it soon.

    ReplyDelete

పాఠకులందరికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు.ఇట్లు - భారతీయులం