madyapaanam vipareethanga perigipoyindi neti kalam lo.

ఇటీవల కాలంలో పట్టణాలలోనే కాక, గ్రామాలలో కూడా మద్యపానం విపరీతంగా పెరిగిపోయింది. ముఖ్యంగా గ్రామాల్లో, వ్యవసాయధారులు తాగుడు వల్ల ఎన్నో అనర్థాలకు గురవుతున్నారు. ముఖ్యంగా మగవారిలో మద్యపానం ఎక్కువ అవడం వల్ల వారికి అనేక ఆరోగ్య సమస్యలతో పాటు, కుటుంబ ఆదాయం తగ్గి, సామాజిక సమస్యలతో బాధపడు తున్నారు.


మద్యపానీయులను (ఆల్కహాలు) చక్కెర ఉన్న ద్రవ పదార్థాలను పులియ బెట్టి తయారు చేస్తారు. ఈ మద్యపానీయాలు ముఖ్యంగా మూడు రకాలుగా ఉంటాయి.బట్టీ పట్టిన మద్య పానీయాలలో మాల్టెడ్‌ మద్యాలు, వెైన్ల కన్నా ఆల్కహాల్‌ శాతం ఎక్కువగా ఉంటుంది.

మద్యపానీయాల వినియోగంలో సురక్షిత పరిమితులు:
ఎంత మద్యం తాగితే సురక్షితమో చెప్పడం చాలా కష్టం.
మద్యం వల్ల కాలేయ వ్యాధి వస్తుంది అన్న దాన్ని సూచనగా తీసుకున్నట్ల యితే కింద తెలిపిన మోతాదుకు మించి తాగ రాదు.
మగవాళ్లు : ఒక రోజుకు 190 మి.లీ. లేదా 1/4 సిసీ ఘాటు మద్యం.
ఆడవాళ్లు : రోజుకు 65 మి.లీ.
ప్రతిరోజు తాగే వారికి ఎప్పుడో సరదా కోసం తాగేవారి కంటే ఎక్కువ హాని కలుగుతుంది.
ఒక వారం రోజుల పెైగా తాగే ఆల్కహాలును ఒకటి రెండు రోజుల్లోనే తాగి నట్లయితే గాయపడడానికి, ప్రమాదాల వల్ల చనిపోవడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి.

ఆహార పోషణలో మద్యం పాత్ర?
ఒక గ్రామం మద్యం ద్వారా 7.0 కాలరీల శక్తి లభిస్తుంది. కానీ ఈ కాలరీలు అంత మంచివి కాదు. ఎందుకంటే వీటిలో ఆహార పుష్టినిచ్చే గుణం లేదు. కేవలం శక్తిని మాత్రం ఇస్తాయి. పేదవారిలో, ముఖ్యంగా సాంఘీక, ఆర్థిక పరిస్థితులు తక్కువగా ఉన్న వారిలో మద్యపానం వలన లోప పోషణ ఎక్కువ కలుగుతుంది. మద్యపానం చేసే వారు ఆరోగ్యంగా ఉన్న వారి కంటే ఎక్కువ ఆహారం తింటారు. దీనికి గల కారకాలు ఏమిటంటే... 
  • ఆహారం తక్కువగా తీసుకోవడమూ, ముఖ్యంగా అన్ని పోషకాలు గల సమతూల ఆహారాన్ని తీసుకోకపోవడము.
    Alco3
  • జీర్ణకోశంలో మార్పు రావడం వలన గాని, సరిగా పని చేయకపోవడం, పోషక పదార్థాలు సరిగా గ్రహించుకో లేకపోవడం, లోప పోషణ వలన పేగులు పాడవడం జరుగుతుంది.
  • కాలేయం మరియు ప్యాన్‌క్రియాస్‌ దెబ్బతినడం.
  • శరీరంలో పోషకాల జీవక్రియ, నిల్వ ఉంచుకొనే శక్తి తగ్గటం.
  • పోషక పదార్థాలు, ముఖ్యంగా బి విటమిన్ల అవసరం ఎక్కువ కావడం.
  • మల మూత్రాల ద్వార ఎక్కువ పోషకాలు విసర్జితం కావడం.

--

0 comments:

Post a Comment

పాఠకులందరికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు.ఇట్లు - భారతీయులం