కసబ్ కి ఉరి..! మరణశిక్ష ఖరారు చేసింది.

కసబ్ కి ఉరి..!

ముంబై ముట్టడిలో సజీవంగా పట్టుబడ్డ పాకిస్థాన్ ఉగ్రవాది మహ్మద్ అజ్మల్ కసబ్‌కు సుప్రీంకోర్టు మరణశిక్ష ఖరారు చేసింది.2008 నవంబర్ 26న ముంబై దాడుల ఘటన కేసులో ఉగ్రవాది అజ్మల్ కసబ్‌కు ఉరిశిక్షే సరైనదని దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్
రీం కోర్టు బుధవారం వ్యాఖ్యానించింది.

దాడులలో 166 మంది మృతి చెందగా, అనేక మంది తీవ్రంగా గాయపడ్డారు. కోట్లలో ఆస్తి నష్టం వాటిల్లింది.విచారణ సమయంలో కసబ్ తనకు సరైన సౌకర్యాలు కల్పించడం లేదంటూ ఆరోపించారు. తనకు బిర్యానీ కావాలని ఒకసారి, బాలీవుడ్‌లో నటించాలని ఉందంటూ మరోసారి, తనకు ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదంటూ కేసును తప్పుదోవపట్టించడానికి యత్నించాడు.కసబ్ కేసు విషయంలో 11వేల పేజీలతో దర్యాఫ్తు సంస్థ ఛార్జీషీట్ దాఖలు చేసింది. 13 నెలల పాటు దర్యాఫ్తు సంస్థ ఈ కేసును విచారించింది. 3192 సాక్ష్యాధారాలను పరిశీలించింది.ముఖ్యంగా 26/11 బాధిత కుటుంబాలు సుప్రీంకోర్టు తీర్పు పట్ల హర్షం వ్యక్తం చేశాయి. వెంటనే శిక్ష అమలు చేయాలని కోరుతున్నాయి. - m&k 


"Yes, Kasab has been hanged this (Wednesday) morning at 7.30 a.m. in Yerawada Central Jail," Special Public Prosecutor Ujjwal Nikam, who led the 26/11 terror attacks case, told IANS.

--

0 comments:

Post a Comment

పాఠకులందరికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు.ఇట్లు - భారతీయులం