చరిత్రలో ఈ రోజు - May 3 'రాజా హరిశ్చంద్ర' మూగ చిత్రాన్ని 99 ఏళ్ల,రాష్ట్రపతిగా వి.వి.గిరి,ఆవిరితో నడిచే రైలు (పొగబండి) సేవలు..@ భారతీయులం

చరిత్రలో ఈ రోజు - May 3
1830: ప్రతీ రోజూ ప్రయాణీకులను తీసుకువెళ్ళటానికి, ఆవిరితో నడిచే రైలు (పొగబండి) సేవలు, మొదటి సారిగా మొదలయ్యాయి.
1969: భారత రాష్ట్రపతిగా వి.వి.గిరి పదవిని చేపట్టాడు
2002 : భారత వాయుసేనకు చెందిన మిగ్-21 విమానం, జలంధర్ లోని, బాంక్ ఆఫ్ రాజస్థాన్ దగ్గర కూలిపోయి, ఏడుగురు బాంక్ ఉద్యోగులు, 1 కూలీ మరణించగా, 17మంది గాయ పడ్డారు. పైలట్ ఫ్లైట్ లెఫ్ట్‌నెంట్ ఎస్.కె. నాయక్ క్షేమంగా తప్పించుకున్నాడు.
1939: నేతాజీ సుభాష్ చంద్ర బోస్ ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ స్థాపించాడు.
1969: భారత మూడవ రాష్ట్రపతి జాకీర్ హుస్సేన్ మరణం.

జననాలు
1932: ప్రసిద్ధ భాషావేత్త, బూదరాజు రాధాకృష్ణ
1959: ఉమా భారతి, కాషాయధారిణి, బారతదేశపు రాజకీయవేత్త.

1913 – దాదాసాహెబ్ ఫాల్కే తీసిన నాలుగు రీళ్ల 'రాజా హరిశ్చంద్ర' మూగ చిత్రాన్ని 99 ఏళ్ల కిందట 1913 ఏప్రిల్ 21న బొంబాయిలోని 'ఒలింపియా సినిమా' హాలులో ఎందరో ప్రముఖులను ప్రత్యేకంగా ఆహ్వానించి, ప్రివ్యూ షోగా ప్రదర్శించారు. ఆ తర్వాత పన్నెండు రోజులకు అంటే మే 3వ తేదీ, శనివారం నాడు అది బొంబాయిలోని 'కొరొనేషన్ సినిమాటోగ్రాఫ్' హాలులో విడుదలైంది.@ భారతీయులం | www.facebook.com/bharatiyulam 

0 comments:

Post a Comment

పాఠకులందరికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు.ఇట్లు - భారతీయులం