చరిత్ర లో ఈరోజు may 20,బిపిన్ చంద్ర పాల్ మరణించాడు.ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు మరణించాడు.రాష్ట్ర మాజీ ముఖ్య మంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి
చరిత్ర లో ఈరోజు may 20
1506: అమెరికాను కనిపెట్టిన యాత్రికుడు క్రిస్టొఫర్ కొలంబస్ మరణించాడు.
1932: బిపిన్ చంద్ర పాల్ మరణించాడు.
1957: ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు మరణించాడు.
1994: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్య మంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి మరణించాడు.వాస్కో డ గామా భారత్ చేరిన రోజు (మే 20): ఆసియాకు సముద్ర మార్గాన్ని కొను గొనేందుకు పోర్చుగల్ రాజు ఎంపిక చేసిన యాత్రా బృందానికి వాస్కో డ గామా సారథి గా నియమించబడ్డాడు. తూర్పు దేశాలతో వాణిజ్యంలో ముస్లింల ఆధిపత్యాన్ని తగ్గించా లన్నది పోర్చుగల్ రాజు అభిప్రాయం. 08-07-1497న పోర్చుగల్ రాజధాని లిస్బ న్ రేవు నుంచి 'సావగాబ్రియల్', 'సావో రాఫె ల్', 'బెర్రియా' అనే నౌకలలో యాత్ర జరిగిం ది. 'కేఫ్ ఆఫ్ గుడ్‌హోప్' మీదుగా ప్రయాణిం చి 20-05-1498న భారత్‌లోని కాలికట్ రేవు పట్టణం మీద కాలుమోపాడు వాస్కో డ గామా. కాలికట్ హిందూ రాజు జామోరిన్ ఆయనకు స్వాగతం పలికాడు.
కాలికట్ చేరి నట్టు తెలిపే శిలాఫలకాన్ని వాస్కో డగామా ప్రతిష్టించాడు. 09-07- 1499న తిరిగి పోర్చుగల్ చేరుకున్నాడు. రాజు అతనికి 'డోమ్' అనే బిరుదునిచ్చాడు. ఆ తరువాత పోర్చుగల్ రాజు పంపిన 13 నౌకల బృం దాన్ని కాలికట్ రాజు నాశనం చేశాడు. వా స్కో డ గామా అడ్మిరల్ గా తిరిగి భారత్ వచ్చాడు. కన్ననూర్, కొచ్చిన్ పాలకుల సహా యంతో కాలికట్‌పై దాడిచేశాడు. 1524లో వాస్కో డ గామా భారత్‌లో పోర్చుగీసు వైస్రా య్‌గా నియమించబడ్డాడు. 24- 12- 1524న మరణించాడు. యూరప్ నుండి భారత్‌కు సముద్ర మార్గాన్ని కనుగొని భారతావనిలో వలసపాలనకు నాంది పలికాడు గామా.@ భారతీయులం
0 comments:
Post a Comment
పాఠకులందరికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు.ఇట్లు - భారతీయులం