చరిత్రలో ఈ రోజు/మే 7 - విశ్వకవి రవీంద్రనాథ్ టాగూర్ జన్మదినం,అల్లూరి సీతారామరాజు జమేదారు కంచూమీనన్‌చే బంధించబడ్డాడు....@ భారతీయులం

చరిత్రలో ఈ రోజు/మే 7
1861: విశ్వకవి రవీంద్రనాథ్ టాగూర్ జన్మదినం
1924: స్వాతంత్ర్య సమర యోధుడు అల్లూరి సీతారామ రాజు మరణించాడు.అల్లూరి సీతారామరాజు జమేదారు కంచూమీనన్‌చే బంధించబడ్డాడు.
1964: ప్రసిద్ద రంగస్థల నటి, గాయని, చలనచిత్ర కళాకారిణి పసుపులేటి కన్నాంబ మరణించారు.
1972: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య మరణించారు.
1983: 7 వ అలీన దేశాల శిఖరాగ్ర సమావేశం ఢిల్లీలో ఇందిరా గాంధీ అద్యక్షతన ప్రారంభం.@ భారతీయులం

రవీంద్రనాథ్ ఠాగూర్ (Rabindranath Tagore) 1861 మే 7వ తేదీన బెంగాల్‌లో జన్మించాడు. ప్రముఖ కవి అయిన ఠాగూర్ 1913లో గీతాంజలి రచనకుగాను నోబెల్ బహుమతి పొంది ఈ ఘనత సాధించిన తొలి భారతీయుడిగా నిలిచాడు. భారత జాతీయ గీతం "జనగణమణ" కూడా ఠాగూర్ రచించినదే. ఆగస్టు 7, 1941న ఠాగూర్ మరణించాడు.

రవీంద్రనాథ్ ఠాగూర్ యొక్క ముఖ్య వ్యాఖ్యలు :
1) పరబాషా ద్వారా బోధన అంటే సోపానాలు లేని సౌధం లాంటిది.
2) కాలం చెక్కిలిపై కన్నీటి చుక్క తాజ్‌మహల్.
3) ప్రేమించే వ్యక్తికి దండించే అధికారం కూడా ఉంటుంది.


అల్లూరి సీతారామరాజు: భారత స్వాతంత్ర్య చరిత్రలో అల్లూరి సీతారామరాజు (Alluri Sitaramaraju) ఒక మహోజ్వల శక్తి. ఇతడు జరిపిన సాయుధ పోరాటం స్వాతంత్ర్య ఉద్యమంలో ఒక ప్రత్యేక అధ్యాయం. సాయుధ పోరాటం ద్వారానే స్వతంత్రం వస్తుందని నమ్మి, దాని కొరకే తన ప్రాణాలర్పించిన యోధుడు అల్లూరి. కేవలం 27 ఏళ్ళ వయసులోనే నిరక్షరాస్యులు, నిరుపేదలు, అమాయకులు అయిన అనుచరులతో, చాలా పరిమిత వనరులతో బ్రిటీషు సామ్రాజ్యమనే మహా శక్తిని ఢీకొన్నాడు.


దామోదరం సంజీవయ్య:మన రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రి , తొలి దళిత ముఖ్యమంత్రి. రాష్ట్రములో మరియు కేంద్ర ప్రభుత్వములో అనేక మార్లు మంత్రి పదవిని నిర్వహించాడు. రెండుసార్లు అఖిల భారత కాంగ్రేస్ కమిటీ అధ్యక్షుడు అవడము కూడా ఈయన ప్రత్యేకతల్లో ఒకటి. ఈయన కాంగ్రేసు పార్టీ తొలి దళిత అధ్యక్షుడు కూడా. 38 సంవత్సరాల పిన్న వయసులో ముఖ్యమంత్రి అయిన ఘనత ఈయనకే దక్కింది.


పసుపులేటి కన్నాంబ :1940లో భవాని ఫిలింమ్స్‌ వారు ‘చండిక’ చిత్రాన్ని నిర్మించారు. ఇందులో ‘నేనే రాణినైతే.. యేలనే ఈ ధర ఏకధాటిగా’ అంటూ కన్నాంబ పాడితే..ఆమె అభినయానికి ప్రక్షకులు ఆమెశపూరితులయ్యారు. కేవలం ఈ పాటకోసం ఈ చిత్రాన్ని మళ్ళీ మళ్ళీ చూసిన వాళ్లు చాలామందే ఉన్నారు. ఈ చిత్రంలో గుర్రం స్వారీ అవసరం అంటే పట్టుదల వహించి కన్నాంబ నేర్చుకున్నారు. ఈ చిత్ర నిర్మాణ సమయంలో చిరుత పులులకు ఆహారం తినిపించి, వాటిని మచ్చిక చేసుకుని నటించిన సాహసికురాలు. ఒక నటి క్రూర జంతువులతో నటించడం అదే తొలిసారి. ఈ చిత్రంలో విలన్‌గా నటించిన బళ్ళారి రాఘవాచారి కన్నాంబ నటనను అభినందిస్తు ‘హావభావాల అధినేత’ గా అభివర్ణించారు.
కన్నాంబ  పాడిన చిత్రాలలో కొన్ని... 
పాట  చిత్రం  సంవత్సరం 
జననం   హరిశ్చంద్ర  1935
ఆ వసంత  శోభ కనకతార   1937
బాధ సహనమే గృహలక్ష్మి   1938
ఆనందమాయే నహో చండిక    1940
జోజో నందబాల తొలిప్రేమ   1941
ఓ మాలతి  మాయ మశ్చింద్ర  1945
స్త్రీ భాగ్యవే  ముగ్గురు మిత్రులు 1946
తెరతీయగ రాదా పల్నాటి యుద్ధం 1947

కెరీర్‌... 
Kannambaaaకన్నాంబ 1912 సెప్టెంబర్‌ 20న ఏలూరులో జన్మించారు. ఆమె తండ్రి నరసప్పనాయుడు ప్రభుత్వోద్యోగి. చిన్నప్పుడే కళల పట్ల ఆసక్తిని పెంచున్నారు.ఆయితే శాస్త్రీయ నృత్యంలో ప్రావీణ్యం సంపాదించిన కన్నాంబకు ఆదిలోనే చేదు అనుభవం ఎదురైంది. నృత్యళాకారులను నీచమైన దృష్టితో చూసే ప్రేక్షకుల వైఖరిని నిరసిస్తూ ఇక జీవితంలో కాలికి గజ్జలు కట్టనని అమె శపథం చేశారు. సినీ రంగంలో ప్రవేశించిన తరువాత కూడా దానికే కట్టుబడి ఉన్నారు. కన్నాంబ నాటక రంగ ప్రవేశం ఏలూరులో జరిగింది. తన 13 ఏట ఏలూరులోని ‘నావెల్‌ నాటక సంఘం’ చేరి అనేక నాటకాలలో నటించారు. 1936లో తెరకెక్కిన ‘ద్రౌపది వస్త్రాపహరణం’ చిత్రంతో ప్రారంభమైన కన్నాంబ నటజీవితం అనార్కలి, వదిన, లవకుశ, రాజ ముకుటం వంటి అనేక హిట్‌ చిత్రాలతో సాగింది. అంతే కాకుండా కన్నాంబ మంచి గాయనిగా కూడా తన సత్తా చాటుకున్నారు.మంచి నటిగా, గాయనిగా ప్రేక్షకుల మదిలో చోటుసంపాదించిన కన్నాంబ 1964లో కన్నుమూశారు.
 ప్రొఫైల్‌... 
    పూర్తి పేరు : పసుపులేటి కన్నాంబ
    పుట్టిన తేది  : సెప్టెంబర్‌ 20, 1912
    జన్మస్థలం : ఏలూరు
    భర్త         : కదరు నాగభూషణం
    వృత్తి         : నటి, గాయని,రచయిత, డైరక్టర్‌
   తొలిచిత్రం : ద్రౌపది వస్త్రాపహరణం (1936)



0 comments:

Post a Comment

పాఠకులందరికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు.ఇట్లు - భారతీయులం