స్పామ్ ఈమెయిలు పంపడం లో మనదే అగ్రస్థానం.మీకు తెలుసా.. అమెరికా ని సైతం వెనక్కి నెట్టేసి మనం ముందుకి వెళ్తున్న వైనం.
స్పామ్ ఈమెయిలు పంపడం లో మనదే అగ్రస్థానం.మీకు తెలుసా.. అమెరికా ని సైతం వెనక్కి నెట్టేసి మనం ముందుకి వెళ్తున్న వైనం.
'స్పామ్ ఈ మెయిల్స్' పంపడంలో భారత దేశం అగ్ర స్ధానం ఆక్రమించిందని కంప్యూటర్ సెక్యూరిటీ సంస్ధ 'సోఫోస్' తెలిపింది. అమెరికాని రెండో స్ధానంలోకి నెట్టి భారత దేశం అగ్ర స్ధానానికి చేరిందని ఆ సంస్ధ తెలిపింది. అయితే ఇందులో భారతీయుల తప్పేమీ లేదు. మొదటిసారి ఇంటర్నెట్ వినియోగిస్తున్న భారతీయులకు ఈ మెయిల్ వినియోగంలో అనుభవం లేకపోవడమే దీనికి కారణమని 'సోఫోస్' తెలిపింది. సోఫోస్ సంస్ధ స్పామ్ మెయిళ్ళు అధికంగా వచ్చే కంప్యూటర్ల సంఖ్య ఆధారంగా వివిధ దేశాలకి ర్యాంకులు ఇస్తుంది. ఒక్కో దేశంలోని కంప్యూటర్ల ద్వారా ప్రసారం అయ్యే స్పామ్ ఈ మెయిళ్ల సంఖ్యను అది లెక్కించి ర్యాంకులు ఇస్తుంది. దానర్ధం స్పామ్ మెయిళ్ళు ఆ కంప్యూటర్ల నుండి బయలు దేరకపోవచ్చు. కంప్యూటర్లను స్వార్ధప్రయోజనాలకు ఉపయోగించే నిపుణులు ఇతర దేశాల్లో ఉండే కంప్యూటర్లను తమ అదుపులోకి తెచ్చుకుని వాటి ద్వారా స్పామ్ మెయిళ్ళు పంపవచ్చు. ఇంటర్నెట్ మొత్తం మీద వస్తున్న స్పామ్ ఈమెయిళ్లలో 10 శాతం భారతీయుల కంప్యూటర్లనుండి వస్తున్నాయని సోఫోస్ తెలిపింది. 8.3 శాతంతో అమెరికా అగ్ర స్ధానంలో ఉండగా చిన్న దేశం అయిన దక్షిణ కొరియా కంప్యూటర్ల ద్వారా 5.7 శాతం స్పామ్ ఈమెయిళ్ళు వస్తున్నాయని తెలిపింది. భారత దేశం అగ్ర స్ధానం ఆక్రమించడానికి ప్రధాన కారణం భారితీయుల అనుభవ రాహిత్యమేనని ఆ సంస్ధ తెలియజేసింది. స్పామర్లు సెలవు రోజుల్లో అధికంగా స్పామ్ లను సృష్టించి పంపుతారని సోఫోస్ నివేదిక వివరించింది. సెలవుల సీజన్లలో వారి కార్యకలాపాలు తీవ్ర స్ధాయిలో ఉంటాయని తెలిపింది. కంప్యూటర్ వినియోగదారులు తప్పని సరిగా వైరస్ ల నుండి కాపాడుకోవడానికి యాంటీ వైరస్ ప్రోగ్రాంలు వినియోగించాలని సోఫోస్ నివేదిక సలహా ఇచ్చింది. యాంటీ వైరస్ ప్రోగ్రాంలను ఎప్పటికప్పుడు అప్ డేట్ చేసుకోవాలని కూడా తెలిపింది.
తమకు వచ్చే ఈ మెయిళ్లను అలవాటుగా ఫార్వర్డ్ చేయడం మానుకోవాలని బ్రిటిష్ యాంటీ వైరస్ ప్రోగ్రామ్ ల తయారీ సంస్ధ 'కాస్పరస్కీ ల్యాబ్' ప్రతినిధి కోరాడు. ఈ మెయిళ్లలో ఉండే విషయం ఎంత సకారణంగా కనపడినప్పటికీ జాగ్రత్తగా గమనించాలని ఆ సంస్ధ కోరింది.
'జాతీయ అంతర్జాతీయ వార్తలు, విశ్లేషణ' బ్లాగ్ లో కూడా ఈ మధ్యలో స్పామ్ కామెంట్లు బాగా పెరిగాయి. సోఫోస్ చెప్పినట్లు ఫేస్ బుక్, ట్విట్టర్ ల లో ఖాతాలు ఉన్న వినియోగదారుల వద్ద నుండి ఈ వ్యాఖ్యలు వచ్చినట్లుగా అవి ఉంటున్నాయి. ఫేస్ బుక్ పేజీలకి వెళ్ళినపుడు ఎవరో ఒకరి ఫోటో తో ఆ పేజీలు ఉంటున్నాయి. సోఫోస్ నివేదిక ను బట్టి అటువంటి ఖాతాలన్నీ ఉత్తుత్తివేననీ, కంప్యూటర్లను హైజాక్ చేసి సృష్టించినవేననీ అర్ధం అవుతోంది.
0 comments:
Post a Comment
పాఠకులందరికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు.ఇట్లు - భారతీయులం