పది పెనుభూకంపాలు.1900 - 2012 @ “భారతీయులం”

పది పెనుభూకంపాలు
1900వ సంవత్సరం నుంచి, అంటే గత 112 ఏళ్లలో ప్రపంచంలో సంభవించిన అతి తీవ్రమైన పది భూకంపాల వివరాలు ఇవి: 
1906 జనవరి 31: ఈక్విడార్‌- కొలంబియా, ఈక్విడార్‌ తీరంలో 8.8 తీవ్రతతో భూకంపం సంభవించింది. భూకంపం తీవ్రతకు సునామీ కూడా వచ్చింది. వెయ్యిమంది మరణించారు. సెంట్రల్‌ అమెరికా, శాన్‌ ఫ్రాన్సిస్కో ఉత్తరభాగం, జపాన్‌ పశ్చిమ తీరాలపై సైతం దీని ప్రభావం పడింది.
1952 నవంబర్‌ 4: రష్యా- 9.0 మాగ్నిట్యూడ్‌తో వచ్చిన భూకంపం సునామీని సృష్టించింది. ఈ సునామీ హవాయ్‌ దీవుల్ని కూడా తాకింది. కానీ ప్రాణనష్టం జరగలేదు.

1960 మే 22: చిలీ- 9.5 మాగ్నిట్యూడ్‌తో (తీవ్రత) శాంటియాగో, కాన్సెప్సియాన్‌లలో అతి పెద్ద అలలతో, లావా ప్రవాహాలతో వచ్చిన భూకంపం తాకిడికి అయిదు వేల మంది మరణించారు. ఇరవై లక్షల మంది నిరాశ్రయులయ్యారు.
1964 మార్చి 28: అలాస్కా- భూకంపం, దాంతోపాటు వచ్చిన సునామీ బారిన పడి 125 మంది మరణించారు. 310 మిలియన్‌ డాలర్ల విలువగల ఆస్తి నష్టం సంభవించింది. 9.2 తీవ్రతతో ప్రకంపనలు అలా స్కా, యూకోన్‌ టెరిటరీ పశ్చిమ ప్రాంతం, కెనడాలో బ్రిటీష్‌ కొలంబియా ను తమ గుప్పిట్లోకి తీసుకున్నాయి.

1965 ఫిబ్రవరి 4: అలాస్కా- 8.7 తీవ్రతతో సంభవించిన భూకం పం సునామీని కూడా తీసుకొచ్చింది. షేమా దీవిలో 35 ఎత్తుకు అలలు ఎ గిసిపడ్డాయి.
2004 డిసెంబర్‌ 26: ఇండోనేసియా- ఇక్కడి సుమత్రా దీవి ఏస్‌ ప్రావిన్స్‌ తీరంలో 9.1 తీవ్రతతో భూకంపం వచ్చింది. దాంతోపాటు వచ్చి న సునామీ మాటలకందని బీభత్సాన్ని సృష్టించింది. శ్రీలంక, థాయ్‌లాండ్‌, ఇండోనేసియా, ఇండియా, మరో తొమ్మిది దేశాల్లో 2,26,000 మందిని పొట్టనపెట్టుకుంది.
2005 మార్చి 28: సుమత్రా- 8.6 తీవ్రతతో వచ్చిన ఈ భూకంపంలో 1300 మంది మరణించారని అంచనా.
2010 ఫిబ్రవరి 27: చిలీ- 8.8 తీవ్రతతో వచ్చిన భూకంపం, ఆ తర్వాత వచ్చిన సునామీలో 500 మంది మరణించారు. 30 బిలి

యన్‌ డాలర్ల నష్టం సంభవించింది. వేలాది నివాసాలు, వంతెనలు కుప్పకూలాయి.
2011 మార్చి 11: జపాన్‌- 9.0 తీవ్రతతో కూడిన భూకంపం జపాన్‌పై విరుచుకు పడింది. ఈ కంపం భూమికి 15.1 మైళ్ల అడుగున సంభవించింది. జపాన్‌లో ఇంతవరకు వచ్చిన భూకంపాల్లో అతి బలమైందిగా నమోదైంది. 15 వేల మందికి పైగా మరణించారు. ఫిలిప్సీన్స్‌, తైవాన్‌, ఇండోనేసియా సునామీ హెచ్చరికలు జారీ చేశాయి. దూరాన ఉన్న కొలంబియా, పెరూలకు కూడా ఈ హెచ్చరికలు చేశారు.
2012 ఏప్రిల్‌ 11: ఇండోనేసియా - దేశంలోని ఏస్‌ ప్రావిన్స్‌ను భూకంపం కుదిపేసింది. ప్రావిన్స్‌ రాజధాని బందా ఏస్‌కు నైరుతి దిశగా 308 మైళ్ల దూరంలో ఇది సంభవించింది. సింగపూర్‌, థాయ్‌లాండ్‌, భారతదేశంపై కూడా దీని ప్రభావం పడింది.@ "భారతీయులం" | bharatiyulam.blogspot.com

--

0 comments:

Post a Comment

పాఠకులందరికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు.ఇట్లు - భారతీయులం