సుమారు వెయ్యి కిలోల బరువున్న ఆ ‘వెడ్డింగ్ ఆల్బం’ అందమైన ‘కప్‌బోర్డ్’కు బదులు ‘గిన్నిస్ రికార్డు’ల్లోకి ఎక్కింది. ‘మాట్రిమోని డే’ సందర్భంగా ఈ నెల 14న ‘్భరత్ మాట్రిమోని డాట్ కామ్’ @ భారతీయులం

సుమారు వెయ్యి కిలోల బరువున్న ఆ 'వెడ్డింగ్ ఆల్బం' అందమైన 'కప్‌బోర్డ్'కు బదులు 'గిన్నిస్ రికార్డు'ల్లోకి ఎక్కింది. 'మాట్రిమోని డే' సందర్భంగా ఈ నెల 14న '్భరత్ మాట్రిమోని డాట్ కామ్'  సంస్థ చెన్నైలో ఈ భారీ ఆల్బంను రూపొందించింది. 13 అడుగుల వెడల్పు, 17 అడుగుల పొడవు ఉన్న ఈ ఆల్బంలో 256 జంటల ఫొటోలను ఉంచారు. 4,300 చదరపు అడుగుల ఫైబర్‌ను వినియోగించి 16 పేజీలతో దీన్ని ఆవిష్కరించారు. 16 మంది వ్యక్తులు రెండు వారాల పాటు కష్టపడి ఈ భారీ ఆల్బంను ఎట్టకేలకు పూర్తి చేశారు. దాంపత్య విలువలు, పెళ్లి ప్రాధాన్యంపై ప్రచారం చేసేందుకు దీన్ని రూపొందించారు. 2008లో చైనాలో నమోదైన రికార్డును తాము అధిగమించామని భారత్ మాట్రిమోని నిర్వాహకులు తెలిపారు.@ భారతీయులం  

0 comments:

Post a Comment

పాఠకులందరికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు.ఇట్లు - భారతీయులం