ఏడు రంగుల ఇంద్ర ధనుస్సు ఈడు వచ్చిన నా వయసు @ {భారతీయులం}

ఏడు రంగుల ఇంద్ర ధనుస్సు ఈడు వచ్చిన నా వయసు 
ఆ ఏడు రంగులు ఏకమైన మల్లె రంగు నా మనసు మల్లె రంగు నా మనసు
ఏడు రంగుల ఇంద్ర ధనుస్సు ఈడు వచ్చిన నా వయసు 
ఆ ఏడు రంగులు ఏకమైన మల్లె రంగు నా మనసు 
మల్లె రంగు నా మనసు 

పసిడి పసుపు మేని రంగు సందె ఎరుపు బుగ్గ రంగు 
నీలి రంగుల కంటి పాపల కొసలలో నారింజ సొగసులు 
ఆకు పచ్చని పదారేళ్ళకు ఆశలెన్నో రంగులు 
ఆ ఆశలన్ని ఆకాశానికి 
ఎగసి వెలెసెను ఇంద్రధనుసై ఇంద్రధనుసై ! @ {భారతీయులం} | నాగేశ్వరరావు గారు  

0 comments:

Post a Comment

పాఠకులందరికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు.ఇట్లు - భారతీయులం