august 15 1947 enti ee charitra telusa meeku

ఆగస్టు 15 ,1947లో అర్ధరాత్రి చట్టపరంగా రెండు ప్రజా సత్టాక రాజ్యాలు వెలిశాయి. ఆ ముందు రోజున , ఆప్పటి కొత్త పాకిస్తాన్ దేశపు రాజధానిగా ఉన్న కరాచిలో అధికార బదలాయింపు సంభందించిన కార్యక్రమాలు జరిగినవి. తద్వారా అప్పటి చివరి బ్రిటిష్ రాజప్రతినిధి , బర్మాకు చెందిన లార్డ్ మౌంట్ బాటన్ కరాచి లోను మరియు ఢిల్లీలో జరిగిన కార్యక్రమాలకు హాజరు కావడానికి వీలైనది. కానీ ఇందుకు మరో కారణం, భారత్ నుండి విడిపోతున్న పాకిస్తాన్ కు భారత్ సార్వభౌమత్వంలో పాలు పంచుకోవడం ఇష్టం లేకపోవడమే. అందుచేతనే పాకిస్తాన్ ఆగస్టు 14న స్వాతంత్రదినోత్సవం జరుపుకోగా, భారతదేశం ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటుంది.

ఆగస్టు 14న పాకిస్తాన్ స్వాతంత్ర దినోత్సవం జరుపుకోవడానికి మరో కారణం, విభజన తర్వాత పాకిస్తాన్ తన సరికొత్త కాలమానమును అమలు చేయడమే. పశ్చిమ పాకిస్తాన్ (నవీన పాకిస్తాన్) యొక్క సరికొత్త కాలమానము, భారత కాలమానము కన్నా 30 నిమిషాలు ఆలస్యంగా ఉంటుంది మరియు తూర్పు పాకిస్తాన్ (నవీన బంగ్లా దేశ్) యొక్క ప్రామాణిక కాలం భారతీయ ప్రామాణిక కాలం కన్నా 30 నిమిషాల ముందు ఉంటుంది. సాంకేతికంగా మాట్లాడుకుంటే ఆగస్టు 14 మరియు 15 మధ్య అర్ధ రాత్రి భారత దేశం స్వ్సతంత్రం పొందినప్పటికీ పశ్చిమ పాకిస్తాన్లో సమయం 11.30 pm మాత్రమే.
19 శతాబ్దపు అంతం లోను మరియు 20 శతాబ్ది ప్రారంభం
ది అల్ ఇండియా ముస్లిం లీగ్ (AMIL) 1906లో ఢాకా నందు, హిందువుల మెజారిటీ గల ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పట్ల నమ్మకం లేని ముస్లీములచే స్థాపించబడినది. హిందూ సభ్యులతో సమానంగా ముస్లిం సభ్యులకు హక్కులు ఇవ్వలేదని వీరు ఫిర్యాదు చేశారు. పర్యవసానంగా వివిధ సమయాల్లో వివిధ రకాలైన పరిస్థితులు తలెత్తినవి. మొట్ట మొదటిగా ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ ను రచయిత/వేదాంతి అయిన అల్లమ ఇక్బాల్ లేవనెత్తాడు. ఇతను 1930లో జరిగిన ముస్లీం లీగ్ సమావేశంలో, హిందువులు ప్రభలంగా ఉన్న భారత ఉపఖండంలో ముస్లీంలకు ప్రత్యేక రాష్ట్రం ఖచ్చితంగా అవసరమని డిమాండ్ చేసాడు.
ది సింద్ అసెంబ్లీ 1935 దీనిని ఒక డిమాండ్ గా చేస్తూ ఒక తీర్మానాన్ని ఆమోదించినది. ఇక్బాల్ జౌహర్ మరియు ఇతరులు కలిసి ,అప్పటివరకు హిందూ ముస్లిం ఐక్యత కోసం పని చేసిన, మొహమ్మద్ ఆలి జిన్నాను తమ కొత్త దేశానికి నాయకత్వం వహించేలా ఒప్పించడంలో చాలా శ్రమించారు. 1930 నుండి సమైక్య భారతదేశంలోని అల్ప సంఖ్యాక వర్గాల స్థితిగతుల గురింఛి, వారిలోని నిరాసక్తతను తొలగించడానికి జిన్నా ప్రయత్నం ప్రాభించాడు. ప్రధాన పార్టీ ఇయిన కాంగ్రెస్ లో తనూ ఒకప్పటి సభ్యుడు అయినందున ముస్లిం వారి ఆకాంక్షల గురించి వాదించడం మొదలుపెట్టాడు.
1932 కమ్మ్యూనల్ అవార్డు ప్రవేసపెట్టడంతో హిందూ ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాలలోని ముస్లిముల మనుగడకు ముస్లిం లీగ్ కు జిన్నా నాయకత్వంతో ముప్పు వాటిల్లనున్నదన్న విష్యం ప్రభలంగా వినిపించినది. కానీ 1937లో జరిగిన ప్రాంతీయ ఎన్నికలలో కన్సర్వేటివ్ మరియు స్థానిక శక్తులతో లీగ్ విజయవంతం కాలేకపోయినది.
1940 లాహోర్ సమావేశంలో ముస్లిములకు ప్రత్యేక దేశం కావాలాన్నట్లు జిన్నా ఒక సందేశం ఇచ్చాడు. కానీ ఈ సందేశం అస్పష్టం గాను మరియు అసంబద్దంగా ఉండడంతో, ముస్లింలలో ప్రాంతీయ ఆలోచనను రేకేత్తించలేదు. ఈ ఆలోచన ముస్లిముల మనసులో నాటుకున్నా, ఆ తర్వాతి ఏడు సంవత్సరాల కాలంలో, ఒక ముస్లిం ప్రాంతీయ వాదానికి పునాది వేసింది. ఖక్సర్ తెహ్రిక్ అఫ్ అల్లామా మష్రికి తో సహా అన్నీ ముస్లిం రాజకీయ పార్టీలు భారతదేశపు విభజనను వ్యతిరేకించాయి. 1940 మార్చ్ 19న మష్రికి ఖైదు చేయబడ్డాడు.
హిందూ మహాసభలాంటి హిందూ సంస్థలు, దేశ విభజనకు వ్యతిరేకం అయినా కూడా, హిందూ ముస్లిముల మధ్య విభేదాలను పురిగోలిపేవి[ఆధారం కోరబడినది]. 1937లో అహమ్మదాబాదులో జరిగిన హిందూ మహాసభల 19 సమ్మేళనంలో వీర్ సావర్కర్ ఈ విషయాన్ని నొక్కి చెప్పాడు.
India cannot be assumed today to be Unitarian and homogeneous nation, but on the contrary there are two nations in the main — the Hindus and the Muslims.
ఎక్కువ మంది కాంగ్రెస్ నాయకులందరూ లౌకికవాదులు[ఆధారం కోరబడినదిమరియు మతపరంగా దేశాన్ని విభజించడం తీవ్రంగా వ్యతిరేకించారు. హిందూ మరియు ముస్లిములు కలిసి శాంతియుతంగా నివసించగలరని మరియు నివసిస్తారని మొహన్దాస్ గాంధిమరియు అల్లామా మష్రిక్ గట్టిగా నమ్మారు. దేశ విభజనను వ్యతిరేకిస్తూ గాంధి ఇలా అన్నారు:
My whole soul rebels against the idea that Hinduism and Islam represent two antagonistic cultures and doctrines. To assent to such a doctrine is for me a denial of God.
గాంధీ మరియు అతని అనుయాయులు కాంగ్రేస్ పార్టీలో(ముస్లీం ఔత్సాహికులు 1930 నుండి బయటకు వెళ్ళడం ప్రారంభించారు) ముస్లీములను ఉంచాలని ఎన్నో సంవత్సరాలుగా కృషి చేసారు. ఈ ప్రక్రియలో హిందూ జాతీయ వాదులకు, మరియు ముస్లిం జాతీయవాదులకు ఘర్షణలు తలెత్తాయి. (హిందూ జాతీయవాది నాధూరాం గాడ్సేచేగాంధి హత్య గావించబడ్డాడు. హిందువుల పేరిట ముస్లీములను గాంధి సమర్ధిస్తున్నాడని గాడ్సే నమ్మాడు.
రెండువైపులా రాజకీయనాయకులు మరియు మతపెద్దలు తమ పరస్పర సందీహాలను మరియు భయాలను వ్యక్తం చేసారు. ముస్లీం లీగ్ వారి డైరెక్ట్ యాక్షన్ డే 1948 కలకత్తాలో, ఐదు వేలకు పైగా ప్రజలు చంపబదడమే గాక పెక్కు మంది గాయపడ్డారని ఈ సందర్భంగా వారు ప్రస్తావించారు. ఉత్తరాంధ్ర మరియు బెంగాల్ లో నిరసన పెల్లుబుకగా ప్రజా యుద్ధం ఆపేందుకు ప్రాంతాల వారీగా విభజన ఒక్కటే మార్గమని ఒత్తిడి పెరగడం ప్రారంభమైనది.
1946 వరకు లీగ్ డిమాండ్ చేసిన పాకిస్తాన్ అనే పదానికి నిర్వచనం చాలా అనువైనది. ఎలాగంటే పాకిస్తాన్ ఒక సార్వభౌమ దేశంగా చెప్పుకోగలిగినది లేదా సంయుక్త భారతదేశపు సభ్య దేశంగా పిలుచుకోవచ్చు.
ముస్లీములు ప్రభలంగా ఉన్న పడమటి ప్రాంతాలలో హిందూ ప్రాభల్యం గల కేంద్రాల కన్నా ఎక్కువ స్వాతంత్ర్యం ముస్లీములకు కల్పించడానికి విభజన అనేది, బేరసారలాడటానికి ఒక ఆయుధంగా, జిన్నా ఉపయోగించుకున్నాడని చరిత్రకారులు నమ్ముతారు.
పాకిస్తాన్ లోకి పొడిగించబడిన భారతదేశపు హిందూ ఆధిక్యత ప్రాంతాలకుగాను, తూర్పు పంజాబ్ మరియు పశ్చిమ బెంగాల్అస్సాంలతో సహా పాకిస్తాన్ లో కలపాలని డిమాండ్ చేయాలని జిన్నా అసలైన ఆలోచన అని ఇతర చరిత్రకారులు చెపుతుంటారు. ముస్లీములు ఎక్కువ భాగం కలిగి, హిందూ పాలకులు పాలిస్తున్న కాశ్మీర్ ను కూడా పాకిస్తాన్ లో కలుపుకోవాలని మరియు హిందూ మెజారిటీ రాష్ట్రాలై ఉండి[citation needed]ముస్లిం పాలకులు గల హైదరబాద్ మరియు జునాగడ్ లను కూడా పొందాలని జిన్నా ఏంతో పోరాటం సాగించాడు.
భారతదేశ సంతతిని బ్రిటిష్ వారు నేరుగా పరిపాలించలేదు. ఇందుకు గాను వివిధ రకాలైన పలు రాజకీయ ఏర్పాట్లు అమలులో ఉండేవి. ప్రాంతాలను నేరుగ ఆంగ్లేయులు పరిపాలిచుట మరియు రాచరికపు రాష్ట్రాలలోచట్టబద్దమైన సామంత ప్రభుత్వాలను నడిపేవారు.
ది బ్రిటిష్ కలోనియల్ అడ్మినిస్ట్రేషన్ నందు భారతదేశపు రాష్ట్ర కార్యదర్శిభారతదేశపు కార్యాలయము,ది గవర్నర్ జనరల్ అఫ్ ఇండియా మరియు ఇండియన్ సివిల్ సర్వీస్ లు ఉండేవి ఆయా ప్రాంతాన్ని సమైక్యం గా ఉంచడానికి బ్రిటిష్ ఇష్టపడేది. కాంగ్రెస్ మరియు ముస్లిం లీగ్ ల మధ్య సయోధ్యత కుదర్చడానికి ప్రయత్నించుటకు 1946లో క్యాబినెట్ మిషన్ పంపబడినది. రాష్ట్రాలను వికేంద్రీకరించి, స్థానిక ప్రభుత్వాలకు అధిక అధికారాన్ని ఇవ్వడమనేది ప్రాధమికంగా ఆమోదం పొందబడినది. రాష్ట్ర వికేంద్రీకరణకు నెహ్రు ఒప్పుకోకపోగా జిన్నా స్వతంత్ర పాకిస్తాన్ కావాలని డిమాండ్ చేయడం ప్రారంభించాడు.
భారతీయులం” |.:: bharatiyulam.blogspot.in ::. | "Facebook| "Twitter"

0 comments:

Post a Comment

పాఠకులందరికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు.ఇట్లు - భారతీయులం