world tb day ప్రపంచ క్షయ వ్యాధి దినం

క్షయ వ్యాధి : అవగాహన

NewsListandDetails

నేడు ప్రపంచ క్షయ వ్యాధి దినం

మన దేశం ఎదుర్కొంటున్న అతి పెద్ద ప్రజారోగ్య ప్రాణాంతక సమస్య క్షయ. ఈ వ్యాధి మైకోబ్యాక్టీరియం ట్యుబర్‌క్యులోసిస్‌ అనే సూక్షక్రిమి ద్వారా వ్యాపిస్తుంది. వయస్సు, లింగభేదం లేకుండా ఈ వ్యాధి ఎరికైనా రావచ్చు. క్షయక్రిమికి ఆక్సిజన్‌ అవసరం కనుక ఇది సాధారణంగా ఆక్సిజన్‌ ఎక్కువగా లభించే ఊపిరితిత్తులకు సోకుతుంది. దీనిని శ్వాసకోశ క్షయ లేదా పల్మొనరీ టి.బి. అంటారు.
క్షయ వ్యాధి జనసమ్మర్థం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో నివసించేవారిలో ఎక్కువగా ఉంటున్నదని పరిశీలనల్ల వెల్లడైంది.
ప్రపంచంలోని 5వ వంతు క్షయ కేసులు భారతదేశంలోనే ఉన్నాయి. మన దేశంలో రోజూ 5 వేల మంది క్షయ వ్యాధికి గురవ్ఞతున్నారు. సంవత్సరానికి సుమారు 18 లక్షల మందికి ఈ వ్యాధి సోకతున్నట్లు గణాంకాలు తెలుపుతున్నాయి. సగటున రోజుకు 1500 మంది ఈ వ్యాధి కారణంగా మరణిస్తున్నారు. మన రాష్ట్రంలో సుమారు 1.08 లక్షల మంది క్షయవ్యాధిగ్రస్తులు ఉన్నట్లు అంచనా.
లక్షణాలు, నిర్ధారణ
ఈ కింద పేర్కొన్న లక్షణాలు కనిపిస్తే క్షయ వ్యాధిగా నిర్దారించవచ్చు. వివిధ దశలనుబట్టి 2 వారాలకు ఇంచి ఎడతెరిపి లేని దగ్గు, సాయంత్రంపూట జ్వరం రావటం, ఆకలి తగ్గడం, ఛాతీలో నొప్పి, బరువ్ఞ తగ్గడం, ఉమ్మిలో రక్తం పడటం, కళ్లె (తెమడ) పడటం, ఆయాసం, త్వరగా అలసిపోవడం, రాత్రిపూట బాగా చెమటలు పట్టడం, నిద్ర పట్టకపోవడం, రోగి అస్తిపంజరంలా మారడం.
క్షయ క్రిమి శరీరంలోకి ప్రవేశించిన వెంటనే వ్యాధి రూపం దాల్చదు. సుూరు 95 శాతం దిలో రోగ నిరోధక వ్యవస్థ దీనిపై సమర్థంగా పోరాడి వ్యాధి రాకుండా అడ్డుకుంటుంది. మిగిలిన 5 శాతం దిలో మాత్రం ఇది రూపాంతరం చెందుతుంది. కొందరిలో ఈ క్రిమి నిద్రాణంగా ఉండి, వారిలోని వ్యాధి నిరోధక వ్యవస్థ బలహీనపడి నప్పుడు - ఉదాహరణకు హెచ్‌ఐవి కారణంగా కాని, పోషకాహార లోపం వల్ల కాని ఇతర కారణాల వల్ల కాని వ్యాధి నిరోధక శక్తి క్షీణించినప్పుడు - విజృంభిస్తుంది.
ఎవరికైనా క్షయ సోకిందనే అనుమానం ఉన్నట్లయితే డిజిగ్నేటెడ్‌ మైక్రోస్కోపీ సెంటర్‌ (డి.ఎం.సి)ల ద్వారా, మన  రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ, వైద్య కళాశాలల ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్ల కళ్లె, ఛాతీ ఎక్స్‌రే పరీక్షలు చేస్తారు. ఇటీవలి కాలంలో మందులకు లొంగని మొండి క్షయను గుర్తించడానికి ఖచ్చితంగా నిర్ధారించే పరీక్షలు అందుబాటులోకి వచ్చాయి.
క్షయ అంటువ్యాధా?
క్షయ తీవ్రమైన అంటువ్యాధి. క్షయ వ్యాధిగ్రస్తులు దగ్గిన ప్పుడు, ఉమ్మినప్పుడు, తుమ్మినప్పుడు, మాట్లాడినప్పుడు రోగ కారక క్రిములు గాలిలోకి సన్నని తుంపర్లుగా వదలడం జరుగుతుంది. ఈ సూక్ష్మమైన తుంపర్ల ఆరోగ్యవంతులు శ్వాస ద్వారా పీల్చేటప్పుడు వారికి 10 శాతం క్షయ వ్యాపిస్తుంది. చికిత్స ఈసుకోని బాసిలస్‌ క్రిములు కలిగి ఉన్న ఒక క్షయ వ్యాధిగ్రస్తుడు ఒక సంవత్సరంలో కనీసం 10 నుంచి 15 మందికి క్షయ వ్యాధిని వ్యాపింపచేయగలుగుతాడు. కనుక క్షయ వ్యాధిగ్రస్తులు దగ్గేప్పుడు నోటికి అడ్డుగా ఒక బట్టను పెట్టుకోవాలి. ఎక్కడపడితే అక్కడ ఉమ్మివేయరాదు.
ఎయిడ్స్‌ దశలో ఉన్న వ్యక్తులకు వచ్చే అవకాశవాద వ్యాధుల్లో క్షయ ప్రధానమైనది. మన దేశంలో హెచ్‌ఐవి / ఎయిడ్స్‌ బాధితుల్లో సుమారు 50 నుంచి 60 శాతం మంది క్షయ వ్యాధికి గురవ్ఞతున్నారు. క్షయ కారణంగా ఎయిడ్స్‌ సోకిన వారి జీవిత కాలం గణనీయంగా తగ్గుతుంది. ఎయిడ్స్‌ బాధితుల్లో మూడవవంతు వ్యాధిగ్రస్తులు కేవలం క్షయ కారణంగానే మరణిస్తున్నారు.
క్షయ అంటువ్యాధి. కనుక క్షయ వ్యాధిగ్రస్తులు ఇంట్లో ఉన్నంతకాలం, వ్యాధి తీవ్రత తగ్గే వరకూ కుటుంబ సభ్యులు, మరీ ముఖ్యంగా చిన్న పిల్లలు వారి వద్దకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. రోగిని వేరే గదిలో ఉంచడం, వారికోసం ప్రత్యేకంగా గ్లాసు, ప్లేటు వంటివి ఏర్పాటు చేయడం అవసరం.క్షయ వ్యాధిగ్రస్తులు ఉన్న ఇంట్లో ఆరేళ్లలోపు చిన్నారులుంటే, వైద్య సలహా మేరకు వారికి మందులు ఇప్పించాలి.
మన దేశంలో 1962 సంవత్సరంలో క్షయ వ్యాధి నివారణ కార్యక్రమం ప్రారంభమైనప్పటికీ అనుకున్నంత ప్రగతి సాధించలేకపోయింది. తరువాత క్షయ వ్యాధిని నియంత్రించడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ ఒక ప్రత్యేకమైన శక్తివంతమైన స్వల్పకాలిక చికిత్సా విధానాన్ని రూపొందించింది. దీనిని 'డాట్స్‌ (డైరెక్ట్‌లీ అబ్జర్వుడ్‌ ట్రీట్‌మెంట్‌, షార్ట్‌ కోర్స్‌ కీమోథెరపీ) అంటారు. ఈ డాట్స్‌ పద్ధతిలో శిక్ష పొందిన డాట్స్‌ ప్రొవైడర్స్‌ ఆరోగ్య కార్యకర్తలు, అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆశా వర్కర్లు మొదలైన వారు మారుమూల గ్రామాల్లో నివసిస్తున్న క్షయ వ్యాధిగ్రస్తులను ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తూ వ్యాధి దశనుబట్టి 6, 7 నుంచి 8, 9 నెలలు చికిత్స అందిస్తున్నారు. మందులను దగ్గర ఉండి వేయడం, వ్యాధి పూర్తిగా నయం అయ్యేలా చూడటం ఈ విధానం ప్రత్యేకత. వ్యాదిగ్రస్తులు క్రమం తప్పకుండా, సరైన మోతాదులో పూర్తికాలం మందులు వాడితే వ్యాధి పూర్తిగా నయమవ్ఞతుంది.
క్షయ వ్యాధిగ్రస్తులు మందులు వాడుతూ తమ పనులను చేసుకోవచ్చు. క్షయ వ్యాధిగ్రస్తులు అన్ని రకాల ప్రోటీన్లు, విటమిన్లు ఉన్న మంచి పౌష్టికాహారం తీసుకోవాలి.
పాకెర్ల బాబు డేవిడ్‌, హెచ్‌ఐవి/ఎయిడ్స్‌ కౌన్సెలర్‌


Very good Article from Vaartha.


--

0 comments:

Post a Comment

పాఠకులందరికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు.ఇట్లు - భారతీయులం