prakruthi sutraalu konni telusukundaam.
ప్రకృతి సూత్రాలు కొన్ని తెలుసుకుందాం !
కాగితాలను వృధా చేయొద్దు – కాగితాలు తయారు చేయడానికి చెట్లను నరకాల్సి ఉంటుంది. కాగితాలను ఆదా చేస్తే చెట్లను రక్షించినట్లే.
పాఠశాలకు నడిచిగానీ, సైకిల్ తొక్కుకుంటూగానీ, బస్ లోగానీ వెళ్ళండి. దీనివలన ఇంధనం ఆదా అవుతుంది, కాలుష్యం తగ్గుతుంది.
స్నానం చేసేటప్పుడు, పళ్ళు తోముకునేటప్పుడు కుళాయి ఆపండి. నీళ్ళు ఆదా అవుతాయి.
పాఠశాలలో సేంద్రియ తోటను ప్రారంభించండి... దానికోసం ప్రకృతిసిద్ధమైన ఎరువును తయారుచేయండి. సహజసిద్ధమైన వనరులను బాగా
ఉపయోగించుకోవడం ఎలాగో మీరు నేర్చుకుంటారు.
వాడనప్పుడు కరెంటు దీపాలు, ఉపకరణాలు, ఎలక్ట్రానిక్ వస్తువులను ఆఫ్ చేయండి. విద్యుత్ ఆదా అవుతుంది.
ఆయా కాలాలలో లభించే పళ్ళను తింటూ ఉండండి. మీరు ప్రకృతిని, డబ్బును ఆదా చేసినవారవుతారు.
చెట్లు నాటండి. అవి మీ పర్యావరణాన్ని పచ్చగానూ, ఆరోగ్యంగానూ ఉంచుతాయి.
ప్యాకేజ్డ్ వస్తువులు, డిస్పోజబుల్స్ తక్కువగా వాడడం ద్వారా చెత్తను తగ్గించండి. మీ పర్యావరణాన్ని శుభ్రంగా ఉంచినవారవుతారు.
మీ ఆటల సమయాన్నివీడియో గేమ్స్, టీవీతో కాకుండా ప్రకృతిలో గడపండి. మీరు ఇంధనాన్ని ఆదా చేసినవారవుతారు...ఆరోగ్యంగా కూడా ఉంటారు.
ప్రకృతిని రక్షించే ప్రచార ప్రతినిధిగా మారండి. ఈ సూత్రాలను మీమిత్రులు అందరికీ తెలిసేటట్లు చూడండి.
0 comments:
Post a Comment
పాఠకులందరికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు.ఇట్లు - భారతీయులం