makara jyothi nijamena asalu sabarimali vishayalu konni sandhehaalu
నాదో చిన్న సందేహం...!
అసలు మకరజ్యోతి నిజమేనా ? ఇంతమంది ఆదరణ పొందిన శబరి మలి ఎందఱో అయ్యప్ప పూజలు నిష్ట గా చేసి అయ్యప్ప దర్శనం కోసం అడివిలో కాలినడకన వెళ్తారు కదా మరి ఇదంతా ఎందుకు ?
ఇది నిజం కాదని చెప్పే ఈ ఛానల్ వాళ్ళు మరి దానిని ప్రసారం చేయడం ఎందుకు ?
చూసే జనాలని పిచ్చి వాలను చేయడమా లేక ఎటూ తెలియని అయోమయం లో పెట్టడానికా !
నెల మేద జరిగేవి వారు చేసారనో లేక వీరు చేసారనో చెప్పచ్చు...మరి గుడికి సంబందించిన ఆభరణాలు తీసుకొచ్చి నప్పుడు గ్రద్ద లేదా ఒక పక్షి వెంబడిస్తుంది మరి అది ఎలా ?
ఇదే ఆ జ్యోతి వెలిగించే స్థలము అని ఒక బ్లాగ్ లో ఒకతను రాసాడు... అక్కడి వారితో కొండపైకి మరియు వీడియో తీసాను అని చెప్పాడు. ఒకటి, రెండు
ఆ జ్యోతి కొందరు వెలిగించేది కొందరు వ్యక్తులు మరియు వారితో అతని ప్రయాణం గురుంచి చెప్పాడు అందులో.
ఏది ఏమైనా ఎవరి నమ్మకం వారిది. అంతే కదా సుమ.
కాని అయ్యప్ప స్వామి దీక్ష వేసుకున్న రోజులు మాత్రం, చెడు అలవాట్లకి దూరంగా ఉంటారు. అందరిని గౌరవం తో స్వామి అని నామస్మరణ చేస్తూ ఉంటారు కానీ కొందరు స్వాములు మరి తెలిసో తెలియకో స్వామి అని అనరు ? ఎందుకో తెలియదు ? మాల వేసుకున్నవారిని వయసు తో సంబంధం లేకుండా అందరి పాదాలకు నమస్కరించే వారు కుడా ఉన్నారు... అది వారు వేసుకున్న దీక్ష మహిమ.
“భారతీయులం” |.:: bharatiyulam.blogspot.in ::. | "Facebook" | "Twitter"
0 comments:
Post a Comment
పాఠకులందరికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు.ఇట్లు - భారతీయులం