vyabhicharam tappa ? asalu enti vyabhicharam ante ?

వ్యభిచారం తప్పా ?
అసలు వ్యభిచారం అంటే ఏంటి ?
ఇలా జీవించేవారిని వేశ్యలు అంటారు. కొంత మంది స్త్రీలు పేదరికం మరియు ఆకలి వల్ల వ్యభిచారిణులుగా మారుతారు. కొంత మంది స్త్రీలు తల్లితండ్రుల నిర్లక్ష్యం ప్రభావం వల్ల వ్యభిచారిణులుగా మారుతారు. కొన్ని ముఠాలు ఉద్యోగాలు పేరుతో అమాయక బలికలని నిర్భందించి ( కిడ్నాప్ చేసి) వ్యభిచార కేంద్రాలకి అమ్మేస్తుంటాయి. 
కూటి కోసం కోటి తిప్పలు.. కొందరు ఉద్యోగాల పేరు తో మోసపోయారు మరి కొందరు పొట్ట కూటి కోసం సొంతంగా చేసేవాళ్ళు.
ఎవరి వ్రుత్తి వారిది....ఒక సంస్థ లో డబ్బులు కోసం పని చేయడం లాగానే..! వాళ్ళు కుడా ఎదిక్కు లేక చివరికి ఇదే వ్రుత్తి గా మార్చుకున్న వారు ఎందఱో.
మన టీవీ వారు ఎదో గొప్పగా వ్యవహరించారు అంటూ గొప్పలు పోతారు...కానీ నిజంగా బలవంతంగా మోసగించి ఈ వూభి లో పడిన వారిని కాపాడి వాళ్ళ పెద్దలకు అప్పగించండి ఎంతో సంతోషిస్తారు.
సగానికి పైగా ఈ వ్రుత్తి నడిపేవాళ్ళు పెద్దవాళ్ళే..బడాబాబులు...మరియు రాజకీయ అండ కుడా.
అసలు దొంగ తెలిసినా పట్టుకోరు కానీ చిన్న స్తాయి వారినే పట్టుకుంటారు.

వ్యభిచారానికి చట్టబద్ధత ?

వ్యభిచారాన్ని అరికట్టటం సాధ్యం కానప్పుడు చట్టబద్ధం చేయరెందుకని సుప్రీంకోర్టు కేంద్రాన్ని ప్రశ్నించింది. వ్యభిచారం ప్రపంచంలోనే అత్యంత పురాతన వృత్తి అని సోలిసిటర్‌ జనరల్‌ చేసిన వాదనపై కోర్టు స్పందిస్తూ.. చట్టప్రకారం అరికట్టలేకపోతున్నప్పుడు మీరెందుకు వ్యభిచారాన్ని చట్టబద్ధంగా గుర్తించరు? అలా గుర్తిస్తే ఆ వ్యాపారాన్ని పర్యవేక్షించవచ్చు, పునరావాసం కల్పించవచ్చు, బాధితులకు వైద్యసాయం అందించవచ్చు అని ధర్మాసనం పేర్కొంది.


--

2 comments



  1. ఇది చాలా జటిలమైన ప్రశ్నే.వ్యభిచారం నైతికంగా తప్పే.సందేహంలేదు.కాని హత్యలు,దోపిడీలు అంత తప్పుకాదు.ఎందువలన అంటే దీనివలన ఇతరులకన్నా అవలంబించే వ్యక్తియే ఎక్కువ బాధ పడుతుంది.మన దేశంలో దీనికి వేరే కులాన్ని ఏర్పరచి సాంఘిక గుర్తింపు నిచ్చారు.కాని నేడు కులవ్యవస్థని ఒప్పుకోము కదా.వ్యభిచారానికి అనేక కారణాలు ఉన్నాయి.అందులో ముఖ్యమైనది పేదరికం.స్వీడన్ వంటి దేశాల్లో దీనికి లైసెన్సులు ఇస్తారు.బెర్నార్డ్ షా 100 సం; కిందటే Mrs.Warrens' profession అనే నాటకంలో ఈ విషయాలన్నీ చర్చించాడు.ఆనాటకాన్ని చదవండి.మద్యపానం వలెనే దీనిని కూడా నిర్మూలించడం సాధ్యం కాదు.మీరు చెప్పినట్లు రెగులేట్ చెయ్యవచ్చుననుకొంటాను.social evils లో ఇది ఒకటి.

    ReplyDelete

పాఠకులందరికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు.ఇట్లు - భారతీయులం