pillalanu dandinchina papaniki jailu paalaina bharatiya dampatulu.

మన దేశం లో ఉన్నట్టు ప్రతీ చోట ఉండదుకదా ?
నార్వే లో ఓహ్ కుటుంబం కి వచ్చిన తిప్పలు.. తన అబ్బాయిని మందలించినందుకు జైలు శిక్ష వేసిన అక్కడి ప్రభుత్వం.
కొన్ని దేశాల్లో చిన్న పిల్లలను కొట్టడం మరియు శిక్షించడం నేరంగా పరిగనిస్తారు. మనము ఎక్కడ ఉంటె ఆ ప్రాంతము మరియు దేశం చట్టాలు వర్తిస్తాయి కదా !
తెలిసో తెలియకో మందలించి తిప్పలు కోరి తెచ్చుకున్నటు అయింది...ఆ దంపతులకు. ఆ దంపతుల భాద విన్నాక చెలించని గుండె లేదు.
కానీ ప్రభుత్వం చొర జేసుకోలేదు ఈ విషయం లో నార్వే ప్రభుత్వం తో అనడంలో ఏమి అనలేని వైనం.

ఎందుకు ఇలాంటి కటిన చర్యలు తీసుకోవడం తెలుసా మీకు ?

పలు రకాల నేరాలు చేసి జైళ్ళల్లో శిక్ష అనుభవిస్తున్న ఖైదీల బాల్యం గురించి చేసిన పరిశోధనలో ఒక వ్యక్తి నేరస్థుడుగా మారడానికి చిన్నప్పటి అనుభవాలు ఎంతో తీవ్రమైన ప్రభావం చూపిస్తాయని, మరింత నిష్కర్షగా చెప్పాలంటే అసలు కుటుంబ వాతవరణం, తల్లిదండ్రుల ప్రవర్తనే పిల్లలను పెద్దయ్యాక నేరస్థులుగా మారుస్తోందని నిర్దిష్టంగా చెప్తున్నారు మానసిక శాస్త్రవేత్తలు. ఈ ఖైదీల బాల్యాన్ని విశ్లేషించి నప్పుడు, పిల్లలలో ప్రతికూల భావాలకు కారణ మయ్యే అంశాలను గుర్తించడం జరిగింది. వీటిని తెలుసుకోవడం వలన తల్లిదండ్రులు, కుటుంబంలోని ఇతర వ్యక్తులు పిల్లల సానుకూల వ్యక్తిత్వ నిర్మాణానికి తాము బాధ్యతాయుతంగా ఎలా ఉండాలనే విషయం అవగతమవుతుంది. ఏ విధమైన కుటుంబ పరిస్థితులు పిల్లల మనో భావాలను తీవ్రంగా దెబ్బతీస్తాయో, వారిలో నేర ప్రవృత్తి కి కారణమవుతాయో నిశితంగా పరిశీలిస్తే.

ఒక సమాజంలోనే కాదు, కుటుంబ సభ్యుల మధ్య కూడా ఒకరితో ఒకళ్ళు నిజం పలకాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది. భార్యా భర్తలు ఒకరితో ఒకరు నిజం పలకాలి. వాళ్ళు ఒకరితో ఒకళ్ళు అబద్ధాలు చెప్పుకుంటున్నారంటే ఆ వివాహం కుప్పకూలే స్థితిలో ఉన్నదని అర్థం. ప్రభుత్వాలు కూడా అబద్ధాలు చెప్పకూ డదని రాజకీయ పండితులు సెలవిస్తుంటారు. అందుకే అబ్రహం లింకన్ ''నువ్వు కొంతమందిని ఎప్పుడూ మోసం చేయగలవు. అందరినీ కొంత కాలంపాటు మోసం చేయగలవు. కానీ అందరినీ అన్ని వేళలా మాత్రం మోసం చేయ లేవు'' అంటాడు. బాల్యంలో పిల్లలు అబద్ధం చెబుతుంటే ''తప్పు బాబూ, అమ్మతో నిజం పలకాలి,'' అంటాం. పిల్లలు నిజం మాట్లాడుతుంటే తృప్తితో శ్వాస పీలుస్తాం. చెప్పినమాట వింటున్నారు, సరైన దారిలో నడుస్తున్నారు, అనుకుంటాం. లేత వయస్సులో అబద్ధాలు చెప్పటం మూలంగా పెద్దగా అపకారాలు జరగవు. కాని టీనేజ్ లోకి వచ్చాక అబద్ధాలు చెబుతుంటే మాత్రం అవి చాలా ప్రత్యేకంగా కనిపిస్తాయి. వాటి ఫలితాలు చాలా నెగటివ్‌గానూ ఉండవచ్చు. ఈ వయస్సులో వాళ్ళు ఎన్నో సమస్యలలో ఇరుక్కునే ప్రమాదం ఉంది. చెడు సావాసాలు, వాహనాన్ని వేగంగా నడపటం, తాగుడు, సెక్స్, హోమ్‌వర్క్ మొదలైన ఎన్నో విషయాలలో వాళ్ళు మన కళ్ళు కప్పే అవకాశం ఉంది. అందుకే టీనేజర్ అబద్ధం చెబుతుంటే తల్లిదండ్రులు వణికిపో తుంటారు. తమకు తెలియకుండా ఏ ప్రమాదం జరుగబోతుందోనని భయపడతారు. అంతేగాక అబద్ధం చెబుతున్న టీనేజ్ పిల్లలు తమ చేతుల్లోంచి జారిపోతున్నారన్న భావం కలుగుతుంది. ఆందోళన, ఏం చేయాలో తెలియని నిస్సహాయత్వం వాళ్ళని ఆవరిస్తాయి.

పిల్లలకు ప్రత్యేక శ్రద్ధ ఎందుకు అవసరం?

వాతావరణ పరిస్థితుల వల్ల పిల్లలు పెద్దల కన్నా అతి త్వరగా ప్రభావితులౌతారు.
అందువల్ల మిగిలిన వయోజనులకన్నా పిల్లలు ప్రభుత్వ, సమాజాల చర్యాచర్యలకు గురి అవుతారు. అనేక చోట్ల, మన సమాజంతోబాటు పిల్లలనేవారు కేవలం వారి తల్లిదండ్రుల సొత్తు లేదా వారు రాబోయే రోజులకు పౌరులు, వారివల్ల ప్రస్తుతం సమాజానికి ఎలాంటి ప్రయోజనం లేదు అనే అభిప్రాయం ఉంది.పిల్లలకు కూడా సొంత తెలివి తేటలు ఉంటాయని, అభిప్రాయాలు వెల్లడించగలరనీ, ఎంపిక చేసుకొనే సామర్థ్యం వాళ్లకుంటుందనీ ఎవరూ ఆలోచించడం లేదు. పెద్ద వాళ్లు పిల్లలకు సలహాలిచ్చి నడిపించాల్సింది పోయి, వారి జీవితాలనే నిర్ణయించి శాసిస్తున్నారు. పిల్లలకు ఎలాంటి ఓట్లు కానీ రాజకీయ ప్రభావం కానీ, ఆర్థిక శక్తి కానీ లేవు. వారి గొంతే ఎక్కడా వినిపించడం లేదు.పిల్లలందరూ సులభంగా హింసలకూ, స్వలాభాలకోసం వాడుకుజూసేవారికీ గురౌతున్నారు.

--

0 comments:

Post a Comment

పాఠకులందరికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు.ఇట్లు - భారతీయులం