engineering graduate governement job IES vivaraalu telugu lo.

ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లకు గవర్నమెంట్ జాబ్‌ ఐ.ఇ.ఎస్.

engineering
ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీసు నోటిఫికేషన్ సాధారణంగా మార్చి నెల 2వ వారంలో వెలువడు తుంది. దరఖాస్తుల స్వీకరణకు ఆఖరుతేదీ సరిగ్గా 30 రోజుల వ్యవధిలో వుంటుంది. పరీక్షలు జూన్ నెలలో జరుగుతాయి. యుపిఎస్‌సి నిర్వహించే 42 సెంటర్లలో ఈ పరీక్షలు నిర్వహిస్తారు. ఈ క్రింది నాలుగు ఇంజనీరింగ్ సర్వీసులకు పరీక్షలు ఏటా నిర్వహిస్తారు. ఖాళీల సంఖ్య ప్రతి సంవత్సరం మారుతుంటుంది. 2012వ సంవత్సరంలో సుమారు 560 ఖాళీలు (47 వికలాంగుల ఖాళీలు కలిపి) ప్రకటించారు. షెడ్యూల్డ్ కులాలు, ఒబిసిలు, షెడ్యూల్డ్ తెగలు, వికలాంగులకు రిజర్వేషన్లు యథావిధిగా వుంటాయి. 

గ్రూప్-ఎ లో నాలుగు సర్వీసులు
1. సివిల్ ఇంజనీరింగ్
2. మెకానికల్ ఇంజనీరింగ్
3. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ 
4. ఎలక్ట్రానిక్స్, టెలీకమ్యూనికేషన్స్ 
ఇంజనీరింగ్
ఉద్యోగాల ఖాళీలు ఆయా విభాగాలకు ఇలా వుంటాయి.

సివిల్ ఇంజనీరింగ్
1. ఇండియన్ రైల్వే ఇంజనీరింగ్ సర్వీసు. 
2. ఇండియన్ రైల్వే స్టోర్సు సర్వీసు (సివిల్)
3. సెంట్రల్ ఇంజనీరింగ్ సర్వీసు
4. ఇండియన్ డిఫెన్స్ ఇంజనీర్ల సర్వీసు (సివిల్స్)
5. ఇండియన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీల సర్వీసు
6. సెంట్రల్ వాటర్ ఇంజనీరింగ్ గ్రేడ్-ఎ. 
సర్వీసు (సివిల్)
7. సెంట్రల్ ఇంజనీరింగ్ సర్వీసు (రోడ్లు) 
గ్రూప్-ఎ (సివిల్)
8. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ 
(సరిహద్దు రోడ్లు)
ఈ ఖాళీలకు ఇంజనీరింగ్ పట్టభద్రులు అర్హులు. అలాగే మెకానికల్ ఇంజనీరింగ్ విభాగం వారు రైల్వేలలోనూ, సెంట్రల్ వాటర్ ఇంజనీరింగ్ లోను, సెంట్రల్ పవర్ ఇంజనీరింగ్ లోనూ, ఇండియనర్ నేవల్, ఆర్మమెంటు సర్వీసు, తదితర సర్వీలసులకు ఎంపిక అవుతారు. అదేవిధంగా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విభాగం వారు, ఎలక్రానిక్స్, టెలి కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ విభాగంవారు పైన వివరించిన వివిధ సర్వీసులకు ఎంపిక అవుతారు. టెలికమ్యునికేషన్ విభాగానికి చెందినవారు ఇండియన్ టెలికమ్యూని కేషన్ విభాగంలోనూ నగూప్-ఎ) జూనియర్ టెలికాం ఆఫీసర్ నగూప్-బి) సర్వీసులకు ఎంపిక అవుతారు. 

దరఖాస్తులు నింపటం..
www.upsconline.nic.in ద్వారా దరఖాస్తు లను ఆన్‌లైన్‌లో అభ్యర్థులు నిర్ణీత గడువులోగా నింపి పంపాలి. అర్హులైన అభ్యర్థులు పరీక్షలకు మూడు వారాల ముందు అడ్మిషన్ సర్టిఫికెట్లు యుపిఎస్‌సి వెబ్‌సైట్ ద్వారా పొందవచ్చు. 
ప్రతి అభ్యర్థి తమ ఇ-మెయిల్ అడ్రస్‌ను కమిషన్‌కు అందజేయాలి. పోస్టుద్వారా అడ్మిషన్ కార్డులు పంపరు.
పరీక్షలలో ఆబ్జెక్టివ్ ప్రశ్నలకు సమాధానాల విషయంలో తప్పులకు నెగెటివ్ మార్కులు ఉంటాయి. 
అభ్యర్థులు సలహా కోసం, సంప్రదింపుల కోసం యుపిఎస్‌సిలో సహాయ కేంద్రం వుంది. 
టెలిఫోన్ ద్వారా సంప్రదించే నెంబర్లు :
011-23385271 
(ఉదయం 10 గం. నుండి. సా. 5 వరకు)
011-23381125 
(ఉదయం 10 గం. నుండి. సా. 5 వరకు)
011-23098543 
(ఉదయం 10 గం. నుండి. సా. 5 వరకు)
ఆబ్జెక్టివ్ తరహా ప్రశ్నలకు omr షీట్ పై బ్లాక్ లేదా బ్లూ పెన్ ద్వారా గుర్తు పెట్టాలి.
జాతీయస్థాయిలో ఇంజనీరింగ్ సర్వీసులకు ఈ నాలుగు విభాగాలలో యువతీ యువకులు ఎంపికవుతుంటారు. 

వయో పరిమితి 
జనవరి 1 నాటికి 
కనీసం : 21 సం॥ లు 4 ఛాన్సులు
గరిష్టం : 30 సం॥ లు
ఒబిసిలకు గరిష్టం : 33 సం॥ లు
కేంద్రప్రభుత్వోద్యోగులకు గరిష్టం : 35 సం॥ లు 
7 ఛాన్సులు
షెడ్యూల్డ్ కులాల వారికి గరిష్టం : 35 సం॥ లు
(ఎన్ని ఛాన్సులైనా)
ఎక్స్ కమిషన్ అధికారులు/ షార్ట్ సర్వీసు కమిషన్ అధికారులకు గరిష్టం : 35 సం॥ 
(5 సంవత్సరల మిలిటరీ సర్వీసు పూర్తిచేసినవారికి) 
అంధులు, చెవిటివారు, వికలాం గులకు : 10 సంవత్సరాలు అదనంగా (40 సంవత్సరాల వరకు)
విద్యార్హత ః ఏదేని విశ్వవిద్యాలయం నుండి ఇంజనీరింగ్ డిగ్రీ లేదా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ వారి ఇన్‌స్టిట్యూట్ పరీక్షల్లో ఎ మరియు బి లో ఉత్తీర్ణత. లేదా ఇతర సమాన డిగ్రీలు.
డిగ్రీ పరీక్షలకు హాజరై ఫలితాలకోసం ఎదురుచూసే వారు కూడా దరఖాస్తు చేయవచ్చు. రాత పరీక్షలో ఇంజనీరింగ్ సర్వీసులకు ఎంపికై నట్లు ప్రకటించిన తర్వాత ఆ సర్టిఫికెట్ (పాసైనట్లు) సమర్పించాల్సి ఉంటుంది. 
దరఖాస్తు ఫీజు : రూ.100/-
(మహిళలకు, షెడ్యూల్డ్ కులాలు/ తెగలవారికి ఫీజు లేదు)

పరీక్షా ప్రణాళిక... 
పరీక్షలో రెండు విభాగాలు ఉంటాయి.
సెక్షన్-1-ఆబ్జెక్టివ్ ప్రశ్నలు
సెక్షన్-2-కన్వెన్షనల్ ప్రశ్నాపత్రం
ఆయా సర్వీసులకు చెందిన సబ్జెక్టులలో.. సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్, టెలికమ్యూనికేషన్స్‌లో నిర్ణీత పాఠ్యప్రణాళిక ఉంటుంది. 

సివిల్ ఇంజనీరింగ్...
సెక్షన్-1 ఆబ్జెక్టివ్ తరహా పేపర్లు...

1). జనరల్ ఎబిలిటీ టెస్టు 2 గంటలు 200 మార్కులు
పార్ట్-ఎ-జనరల్ ఇంగ్లీష్
పార్ట్-బి-జనరల్ స్టడీస్
2). సివిల్ ఇంజనీరింగ్ పేపర్-1 2 గంటలు 200 మార్కులు
3). సివిల్ ఇంజనీరింగ్ పేపర్-2 2 గంటలు 200 మార్కులు

సెక్షన్-2 
కన్వెన్షనల్ పేపర్లు

1). సివిల్ ఇంజనీరింగ్ పేపర్-1 
3 గంటలు 200 మార్కులు
2). సివిల్ ఇంజనీరింగ్ పేపర్-2 3 గంటలు 200 మార్కులు
మొత్తం : 1000 మార్కులు
అదే తరహాలో మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఎలక్రానిక్స్ అండ్ టెలిక మ్యూనికేషన్ ఇంజనీరింగ్ విభాగాల వారికి...
సెక్షన్-1 ః
200+200+200 మార్కులు
సెక్షన్-2 ః 
200+200 మార్కులు
మొత్తం ః 1000 మార్కులు
నెగటివ్ మార్కులు : 0.33
రాత పరీక్షలో అధిక మార్కులు సాధించిన వారిని ఖాళీలను బట్టి పర్సనల్ ఇంటర్వ్యూలకు పిలుస్తారు. కటాఫ్ మార్కులు కమిషన్ నిర్ణయి స్తుంది. 
కన్వెన్షనల్ పేపర్లకు ఇంగ్లీష్‌లోనే సమాధా నాలు రాయాలి. పరీక్ష స్థాయి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ స్థాయిలో ఉంటుంది. 
జనరల్ ఎబిలిటీ పరీక్షలో అభ్యర్థి ఆంగ్ల భాషా పరిజ్ఞానం, పదాలపట్ల అవగాహన తెలుసుకుంటారు.
జనరల్ స్టడీస్ విభాగంలో నిత్య జీవితంలో జరిగే సామాజిక శాస్త్ర విషయాలపట్ల విద్యావంతుని పరిజ్ఞానం తెలుసుకునేలా ప్రశ్నలుం టాయి. అందులో భారతదేశ చరిత్ర, భౌగోళిక పరిజ్ఞానం గురించి కూడా ప్రశ్నలుంటాయి. 
సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, టెలికమ్యునికేషన్ విభాగాల పాఠ్య ప్రణాళిక వివరంగా ప్రకటనతోపాటు ఇస్తారు. దానికి సంబంధించిన విషయ పరిజ్ఞానం కలిగి ఉండాలి. ఆయా సబ్జెక్టుల్లో లోతైన అవగాహన అభ్యర్థికి డిగ్రీ స్థాయిలో అవసరం. 
ఈ సర్వీసులకు శిక్షణనిచ్చే కోచింగ్ సెంటర్లు కూడా ఇటీవల హైదరాబాద్, చెన్నై, ఢిల్లీ వంటి నగరాలలో ప్రారంభమయ్యాయి.
ఇంజనీరింగ్ పట్టభద్రులు ఈ సర్వీసుతోపాటు సివిల్ సర్వీసు పరీక్షలు రాయడానికి కూడా అర్హులు. గత 10 సంవత్సరాలలో ఇంజనీరింగ్ పట్టభద్రుల్లో ఐఎఎస్ ర్యాంకులు బాగా సంపాదిం చిన అభ్యర్థులుండటం గమనార్హం. 

IES పరీక్షా విధానం
Essay Type :

సెక్షన్-2లో సబ్జెక్ట్ పేపర్లు రెండు. 
రెండింటికి 2002=400 మార్కులు.
పేపర్-1లో 7 ప్రశ్నలుంటాయి. అందులో 5 ప్రశ్నలు రాయాలి. 540=200 మార్కులు
పేపర్-2లో మొదటి ప్రశ్న తప్పనిసరి. 80 మార్కులు. (ఇందులో 10 ఉప ప్రశ్నలు 108=80 మార్కులు)
మిగతా సెక్షన్ - ఎ, 3 ప్రశ్నల్లో 2 రాయాలి 230=60 మార్కులు.
సెక్షన్-బి, 3 ప్రశ్నల్లో 2 రాయాలి 230=60 మార్కులు.
ఈ సమాధానాలు వ్యాసరూపంలో ఉంటా యి కాబట్టి నెగిటివ్ మార్కింగ్ లేదు. పరీక్ష డిగ్రీ స్థాయిలో వుంటుంది. ప్రాక్టికల్స్ లేవు.

చేతి రాత సరిగా లేకపోతే 5శాతం మార్కులు గరిష్టంగా పెనాల్టీ. 
ఇబ్బందులు :
120 నిమిషాలలో 120 ఆబ్జెక్టివ్ ప్రశ్నలకు సమాధానాలు గుర్తించగలగాలి. ప్రశ్నలు ప్రాథ మిక స్థాయిలోనే ఉంటాయి. సమస్యకు అప్లికేషన్ చేసే విధానం గమనిస్తారు. గణిత పరిజ్ఞానంతోనే ఇది సాధ్యం అవుతుంది. 

ప్రశ్నాపత్రం సరళి : 
బేసిక్స్ : 40 శాతం ప్రశ్నలు
అప్లికేషన్స్ : 40 శాతం ప్రశ్నలు
ఫార్ములా గ్రాఫ్‌లు : 15 శాతం ప్రశ్నలు
రీజనింగ్ : 5 శాతం ప్రశ్నలు

సబ్జెక్టు పేపర్లు :
- సిలబస్ మొత్తం కవర్ చెయ్యాలి
- గతంలో వచ్చిన పేపర్లు ఒకసారి చూసి వాటి ధోరణి గమనిం చాలి.
- రిఫరెన్సు బుక్స్‌కు సబ్జెక్టులో ప్రముఖులు రాసినవి సేకరించాలి.
- సబ్జెక్టు మీద పట్టు అవసరం.
- సాధారణంగా ఇంజనీరింగ్ సర్వీసు పరీక్షలు జూన్ నెలలో మూడు రోజులపాటు దేశవ్యా ప్తంగా నిర్వహిస్తారు. వాటి ఫలితాలు మరు సటి సంవత్సరం జనవరిలో వెల్లడించి ఫిబ్రవరి - మార్చిలో ఇంటర్వ్యూలు జరుపుతారు.


--

0 comments:

Post a Comment

పాఠకులందరికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు.ఇట్లు - భారతీయులం