aidhava shakti peetam,jogulamba aalampur

అయిదవ శక్తిపీఠం
‘‘లంబస్తమి వికృతాక్షిం ఘోర రూపం మహాబలం 
ప్రేతాసన సమారుడం జోగుళాంబం నమామ్యహం’’ 

 అని ఇక్కడ వెలసిన శక్తి స్వరూపిణి జోగుళాంబ అమ్మవారిని గురించి శంకరాచార్యులు పై స్తోత్రంతో కీర్తించారు.
 హైదరాబాద్‌నుంచి కర్నూలు వెళ్లేదారిలో కర్నూలుకు 11 కిలోమీటర్ల ముందు ఆలంపూర్ క్రాస్‌రోడ్ ఉంది. ఇక్కడి నుంచి ఎడమవైపుకు తీసుకుని 12 కిలోమీటర్లు ప్రయాణిస్తే ఆలంపూర్ గ్రామం వస్తుంది. అక్కడ తుంగభవూదానది ఒడ్డున జోగులాంబ దేవాలయం ఉంది. 


 అష్టాదశ శక్తిపీఠాలలో ఐదవ క్షేత్రంగా విరాజిల్లుతోంది. దక్షిణ కాశీగా, శ్రీశైలానికి పశ్చిమ ధ్వారంగా వెలుగొందుతున్న ఈ పుణ్యక్షేవూతంలో ప్రధాన దేవి దేవతలు శ్రీ బాలవూబహ్మేశ్వరుడు, జోగుళాంబ అమ్మవారు. ఈ క్షేత్రంలో బ్రహ్మకు తొమ్మిది ఆలయాలు ఉండడం విశేషం. ఇంతటి ప్రసిద్ది చెందిన ఈ క్షేత్రాన్ని దర్శించుకునేందుకు దేశం నలుమూలల నుంచే కాక విదేశాల నుంచి కూడా యాత్రికులు వస్తుంటారు. చారివూతకంగా ఈ ఆలయాన్ని 6వ శతాబ్దానికి చెందిన బాదామిచాళుక్య వంశంలోని రెండవ పులకేశి నిర్మించినట్లు ఇక్కడి శాసనాల ద్వారా తెలుస్తోంది. అలంపూర్‌కు పూర్వనామం హేమలాపురం. కాలక్షికమేణా ఈ నామం రూపాంతరం చెందుతూ హతంపురం, యోగులాపురం, జోగుళాపురం, ప్రస్తుతం ఆలంపూర్‌గా రూపాంతరం చెందింది.  
శంకరాచార్యులు దేశంలోని శక్తిపీఠాలను సందర్శించిన సమయంలో ఆలంపూర్‌లోని జోగుళాంబ అమ్మవారిని అయిదవ శక్తిపీ కీర్తించారు. ఇక్కడ వెలసిన అమ్మవారి గురించి ఓ కథ ప్రచారంలో ఉంది. పూర్వం దక్ష ప్రజావూపతినిధి నిర్వహించిన నిరీశ్వరయాగంలో అందరి ముందు శివనింద చేయడంతో ఆ అవమానాన్ని భరించలేక సతీదేవి యోగాగ్నిని కల్పించుకుని దేహ త్యాగం చేసుకుంది. విషయాన్ని తెలుసుకున్న పరమశివుడు ప్రళయ కాలరువూదుడై యాగాన్ని సమూలంగా నాశనం చేసి మరణించిన సతీదేవిని తన భుజస్కందంపై వేసుకుని రుద్రతాండవం చేశాడు.

దీంతో పరమేశ్వరుని కోపాగ్నిని శాంతింపచేసేందుకు విష్ణుమూర్తి తన సుదర్శన చక్రంతో సతీదేవి శరీరాన్ని పద్దెనిమిది శకలాలుగా విభజించారు. ఆ పద్దెనిమిది భాగాలు వేరు వేరు ప్రాంతాల్లో పడ్డాయి. వాటిని శంకరాచార్యులు పద్దెనిమిది పీఠాలుగా గుర్తించి ప్రాణ ప్రతిష్ట చేశారు. ఇందులో దంత పంక్తి భాగం ఆలంపూర్‌లో పడ్డట్లు, దాంతో ఇక్కడ జోగుళాంబ అమ్మవారు వెలిసినట్లు పురాణాల ద్వారా తెలుస్తోంది.
అయితే జోగులాంబవారి పురాతన దేవాలయం 14వ శతాబ్దంలో బహుమని సుల్తానుల దండయావూతలో శిథిలమైంది. ఆ సమయంలో స్థానికులు అమ్మవారి విగ్రహాన్ని, వారి శక్తులైన చండి, ముండిలతో సహా శ్రీసువూబహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో దాచి ఉంచారని స్థానికుల కథనం. 

తరువాత నూతనంగా నిర్మించిన ఆలయంలో అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. జోగులాంబ అమ్మవారు ఉగ్రస్వరూపిణి అందుకే ఆమెకు చల్లదనం కలిగించి, పూజలు చేయడానికి వీలుగా ఆలయం చుట్టూ నీటికొలను నిర్మించారని చెబుతారు. అమ్మవారి విగ్రహం చాలా ప్రత్యేకమైనది. చాలా ఒత్తై జుట్టు, బల్లి, తేలు, గబ్బిలం ఒక కపాలంతో ఉంటుంది. ఆలయ ప్రాంగణంలో సప్తమావూతిక, విఘ్నేశ్వర, వీణాపాణి వీరభవూదుని విగ్రహాలుకూడా ఉన్నాయి. అసలైన ఛండి, ముండు విగ్రహాలు శ్రీబాలసువూబహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలోనే ఉంచి వాటి స్థానే కొత్త విగ్రహాలు తయారు చేసి నూతన ఆలయంలో ప్రతిష్టించారు.  

విశేష దినాలు 
ఆలంపూర్ క్షేత్రంలో కార్తీకమాసం పూజలు, శివరాత్రి పర్వదినాన్ని కన్నుల పండుగగా నిర్వహిస్తారు. కార్తీకమాసంలో జోగుళాంబ అమ్మవారిని విశేష పూజలో పాల్గొనేందుకు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొంటారు. ఇక్కడ జరిగే నవ వర్ణార్చన, కన్య పూజల కోసం మహిళలు అధిక సంఖ్యలో అమ్మవారిని దర్శించుకుంటారు. కార్తీక మాసంలో జరిగే ప్రత్యేక ఉత్సవాల కోసం దేవాలయాన్ని కన్నుల పండుగగా విద్యుత్ దీపాలతో అలంకరిస్తారు. ఈ మాసంలో విఐపిల తాకిడి ఎక్కువగా ఉంటుంది. అలాగే శివరాత్రి పర్వదినాన బాలవూబహ్మేశ్వరుని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తారు. శివరాత్రి పర్వదినం రోజు ఇక్కడ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసేందుకు తెలంగాణ, రాయలసీమకు చెందిన ప్రజలు ఎంతో ఆసక్తి కనబరుస్తారు.























 

 భారతీయులం” |.:: bharatiyulam.blogspot.in ::. | "Facebook"

0 comments:

Post a Comment

పాఠకులందరికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు.ఇట్లు - భారతీయులం