జూన్ 5వ తేదీని "ప్రపంచ పర్యావరణ దినోత్సవం"గా పాటిస్తున్నారు. ఈ పర్యావరణ దినోత్సవం ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీచే 1972, జూన్ 5వ తేదీన స్థాపించబడింది.

జూన్ 5వ తేదీని "ప్రపంచ పర్యావరణ దినోత్సవం"గా పాటిస్తున్నారు. ఈ పర్యావరణ దినోత్సవం ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీచే 1972, జూన్ 5వ తేదీన స్థాపించబడింది. పర్యావరణ దినం సందర్భంగా, ప్రతి సంవత్సరం జూన్ 5న ఏదేని ఒక నిర్ణీత నగరంలో పర్యావరణానికి సంబంధించిన అంతర్జాతీయ సమావేశం జరుగుతుంది.

ఈ అంతర్జాతీయ సమావేశంలో పర్యావరణానికి సంబంధించిన పలు కీలకమైన అంశాలను చర్చించటమేగాకుండా, పర్యావరణాన్ని కాపాడుకునేందుకు పలు మార్గదర్శక సూత్రాలను రూపొందిస్తుంటారు. 1972వ సంవత్సరంలోనే స్థాపించబడిన "ఐక్యరాజ్యసమితి పర్యావరణ పథకం", ఇదే వేదికను ఉపయోగించుకుని పర్యావరణానికి సంబంధించి.. రాజకీయాల్లోని వారికి, ప్రజలకు అప్రమత్తతను పెంచే దిశగా తగు చర్యలను చేపడుతుంది.

1972వ సంవత్సరం నుంచి క్రమం తప్పకుండా ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పాటిస్తున్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా 2005, జూన్ 5న శాన్ ఫ్రాన్సిస్కోలో అంతర్జాతీయ సమావేశాన్ని నిర్వహించారు. ఇందులో గ్రీన్ సిటీస్, "ప్లాన్ ఫర్ ది ప్లానెట్" అనే అంశాలపై విస్తృతంగా చర్చించారు.

జూన్ 5, 2006లో అల్గేరియా దేశంలో, "డోంట్ డెజర్ట్ డ్రైల్యాండ్స్" అనే నినాదంతోనూ... జూన్ 5, 2007లో నార్వేలో "మెల్టింగ్ ఐస్ ఎ హాట్ టాపిక్" అనే నినాదంతో... జూన్, 2008 న్యూజిలాండ్‌లో "కార్బన్‌డయాక్సైడ్, కిక్ ద హాబిట్ టు వర్డ్స్ ఎ లా కార్బన్ ఎకానమీ" అనే నినాదంతోనూ... పర్యావరణ దినోత్సవం సందర్భంగా అంతర్జాతీయ సమావేశాలను నిర్వహించారు.

ఇదిలా ఉంటే... నేడు మానవుడు తన మేధో సంపత్తితో శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకుని, ప్రపంచవ్యాప్తంగా పలు పరిశ్రమలను నెలకొల్పుతున్నాడు. ఈ పరిశ్రమలు వెదజల్లే కాలుష్యంతో కోలుకోలేనంతగా వాతావరణం కలుషితమై... పీల్చే గాలి, త్రాగే నీరు, తినే ఆహారం.. అన్నీ కలుషితమవుతున్నాయి. మానవుడు తన స్వార్థ ప్రయోజనాల కోసం ప్రకృతి ప్రసాదించిన వనరులను అవసరానికి మించి వాడుకుంటున్నాడు.

అంతేగాకుండా, మానవుడు తన వేగవంతమైన జీవితంలో వాహన వేగం పెంచుతూ, ఇంధన కొరతకు కారణమవుతున్నాడు. కార్బన్‌ మోనాక్సైడ్, కార్బన్ డై ఆక్సైడ్ లాంటి విషపూరిత వాయువులు వాతావరణంలో పరిమితికి మించి పెరగడం వల్ల క్రమంగా భూమండలం వేడెక్కుతోంది. అడవులు, జల వనరులు క్రమేపీ తగ్గిపోతున్నాయి. ఈ రకంగా, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంతో సాధించిన పురోగతి కూడా ప్రకృతి కాలుష్యానికి కారణమవుతోంది.@ భారతీయులం 

0 comments:

Post a Comment

పాఠకులందరికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు.ఇట్లు - భారతీయులం