aasanaalu ante enti ? అందరూ ఆసనాలు, యోగా అంటూ చేస్తుంటారు అసలు ఆసనాలు అంటే ఏంటి ? అసలు యోగాసనాలు ఎందుకు వేయాలి? ముఖ్యమైన కొన్నిఆసనాలు

అందరూ ఆసనాలు, యోగా అంటూ చేస్తుంటారు అసలు ఆసనాలు అంటే ఏంటి ?
ఒక మనిషి శారీరకంగా వ్యక్తపరిచే ఎలాంటి భంగిమనైనా సరే ఆసనం అనవచ్చు. అయితే ఆసనం పుట్టుక గురించి ఎలాంటి మూలాధారాలు మనకు అందుబాటులో లేవు. మనిషి పుట్టిన నాటినుంచీ ఇది ఉంది. ఉయ్యాలలో పడుకోబెట్టిన పసిపిల్లలు చేసే విన్యాసాలు కూడా ఆసనాల క్రిందికే వస్తాయి.
అయితే భంగిమలనేవి ఒక క్రమపద్ధతిలో ఉంటూ, తగినంత వ్యాయామం చేస్తే వాటినే యోగాసనాలు అనవచ్చు. ఒక మనిషి సంపూర్ణ ఆరోగ్యవంతుడు అవడానికి కనీసం 25 రకాల ఆసనాలనైనా వేయడం అవసరమని యోగా పండితులు చెబుతుంటారు. 
ఇక చరిత్ర విషయానికి వస్తే... భగవద్గీతలో శ్రీకృష్ణుడు, ఉపనిషత్తులలో మహర్షులు యోగ విజ్ఞానానికి సంబంధించిన పలు విషయాలను వ్యక్తపరిచారు. అవి ఏంటంటే, రాజ, హఠ, కర్మ, భక్తి, ధ్యాన, జ్ఞాన యోగము లాంటివి. వీటిలో రాజయోగం శ్రేష్టమైనది చెబుతుంటారు.

అసలు యోగాసనాలు ఎందుకు వేయాలి?
అంటే.. మానవ శరీరం పలురకాల మాలిన్యాలతో పేరుకుంటూ ఉంటుంది. శరీరంలో కలిగే అనారోగాలకు ఈ మాలిన్యాలే కారణం కాబట్టి, వాటిని ఎప్పటికప్పుడు శుభ్రపరచుకోవాలి. ఈ మాలిన్యాల నిర్మూలకు యోగా ఒక చక్కటి పరిష్కారం. యోగా వలన శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అందువల్ల పెద్దగా కష్టపడనవసరంలేని ఈ ఆసనాలను వేయటం ప్రతి ఒక్కరూ అలవాటు చేసుకోవాలి.

ఆసనాలు అంటే ఒక వ్యక్తి ఒక ప్రత్యేక ప్రయోజనములు సాధించే నిమిత్తము కూర్చుండే, పరుండే శరీర స్థితిలో శరీరారోగ్యాన్ని రక్షించు కొనుట, మానసికంగా శారీరకంగాను అభివృద్ధి, రోగములనుండి కాపాడు కొనుటకు, తగ్గించు కొనుటకు, మందులతో పాటు ఆసనాలను వేసిన తొందరగా ఫలితములు పొందుదురు. శరీర బరువును తగ్గించు కొనుటకు మరియు పెంచు కొనుటకు చాలా ఉపయోగ కరంగా ఉండును. ఈ ఆసనాలను ఉదయము 4 గం || నుండి 6 గం || వరకు వేసిన చాలా మంచి ఫలితములు పొందుదురు.

ముఖ్యమైన కొన్ని రోగములకు ఆసనములను తెల్పుచున్నాము:

సిద్దాసనము : ఈ ఆసనము వేయుట వలన శరీరములోని 72 వేల నాడులు శుద్ధి అవుతాయి. 12 సం || లు వేసిన ముక్తిని ఆనందమును పొందవచ్చును.

బద్ధ పద్మాసనము : దీనివలన గర్భాశయ రోగములు, గ్యాస్ ట్రబుల్ ,కడుపునొప్పి ,అజీర్ణము వంటివి, గూని రాకుండాను, స్వప్న స్కలనాలను అరికట్టును.

కుక్కుటాసనము : దీనివలన నాడీ ప్రసారము బాగా జరుగును. చేతులకు కాళ్ళ కండరాలకు బలము కలుగును.

గోముఖాసనము : దీనివలన ఆర్శ మొలలు తగ్గును.కాళ్ళకు భుజకీళ్ళు, వెన్నెముక ,తొడలలోని వాతము వాపులు నివారించును.

వజ్రాసనము : జీర్ణశక్తికి బొర్ర తగ్గుటకు గర్భ దోషములకు మంచిది. సర్వాంగాసనము: దీనివలన తల, కండ్లు, చెవి, ముక్కు, గొంతు రోగములను తగ్గించు కొనుటకు, థైరాయిడ్ గ్లాండ్ ను పోషించును. ఈ ఆసనము అభ్యాసము వలన అన్ని రోగములను నివారించు కొనవచ్చును.స్త్రీలకు కూడా అనువైనది.వివాహితులకు ఈ ఆసనము మంచిది

మత్స్యాసనము : దీనివలన దీర్ఘ శ్వాస నిశ్వాసలు క్రమబద్దము అయి ముక్కు కండరాల వాపు, ముక్కు దిబ్బడ, జలుబు, తగ్గును. ముఖ రోగములు తగ్గును.మల విసర్జన జరిగి ప్రేవులు శుబ్రపడి మలబద్దకము తొలగి హుషారుగా యుండును.

హలాసనము : దీనివలన గర్భ కోశము, తొడల వాత నొప్పులు, నడుము నొప్పులు, బొజ్జ, లివర్ వ్యాధులు తొలగి పోవును.మధు మేహానికి చాలా మంచిది. భుజంగాసనము : దీనివలన స్త్రీలకు చాలా ఉపయోగకరము. గర్భాశయ బాధలు, నొప్పి, వెన్ను, నడుము నొప్పులకు, ముట్టుశూలకు, ఋతు దోష నివారణలకు చాలా ముఖ్యము.

ధనురాసనము : దీనివలన కాళ్ళు, చేతులు, కీళ్ళలోను, నొప్పులు నివారణ అగును.జీర్ణాశయము, బాగుగా పని చేయును. ఆకలిని పెంచును.కడుపులో నున్న అనవసర కొవ్వును తగ్గించును.

పశ్చిమోత్తాసనము : దీనివలన ఆర్శ మొలలున్న వారికి, మధు మేహంతో బాధ పడేవారికి మంచిది. సుషుమ్నలో ఉత్తెజము కలుగును. బుర్ర పెరిగిన వారికి కూడా ఉపయోగము.

మయూరాసనము : ఈ ఆసనము వేయుట కొంత కష్టము కాని, ఫలితములు అమోఘము. లావుగా యున్నవారు సన్నగా అగుటకు మరియు గర్భ రోగములు, మధు మేహాన్ని (డయాబెటిస్ ) తగ్గించును.@ భారతీయులం  

0 comments:

Post a Comment

పాఠకులందరికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు.ఇట్లు - భారతీయులం