సాయిబాబా పుట్టుపూర్వోత్తరాల గురించి తెలియడంలేదు ? @ “భారతీయులం”

సాయిబాబా పుట్టుపూర్వోత్తరాల గురించి తెలియడంలేదు ? :

Shirdi Sai Baba portrait.jpg
జననం: తెలియదు
జన్మస్థలం: తెలియదు
అసలు పెట్టిన పేరు: తెలియదు
మరణం: అక్టోబరు 15, 1918
మరణ స్థలం: షిరిడీ, భారతదేశం
గురువు: వెంకూసా
వేదాంతం/తత్వం: అద్వైతం
ఉపదేశం: సబ్‌కా మాలిక్ ఏక్ హై

(అందరి ప్రభువు ఒక్కడే)
సాయిబాబా పుట్టుపూర్వోత్తరాల గురించి తెలియడంలేదు. ఈ విషయమై జరిగిన కొన్ని అధ్యయనాల వల్ల బాబా షిరిడీ చుట్టుప్రక్కలే జన్మించి ఉండవచ్చుననీ, అతని బాల్య నామం హరిభావు భుసారి కావచ్చుననీ కొన్ని అభిప్రాయాలున్నాయి. తన జన్మ, బాల్యాల గురించి బాబా ఎప్పుడూ స్పష్టంగా చెప్పలేదు. అవి అనవుసరమని అనేవాడు. ఒకమారు తన ప్రియానుయాయుడైన మహాల్సాపతితో తాను పత్రి గ్రామంలో ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి ఒక ఫకీర్ సంరక్షణలో పెరిగినట్లు చెప్పాడని కధనం ఉంది. మరొకమారు ఫకీరు భార్య తనను సేలుకు చెందిన వెంకోసా అనే గురువుకు అప్పగించినట్లు, తాను వెంకోసా వద్ద పన్నెండేళ్ళు శిష్యరికం చేసినట్లు చెప్పాడంటారు. ఈ రెండు కధనాల వలన బాబా పూర్వ జీవితం గురించి వివిధ అభిప్రాయాలున్నాయి.
తన షుమారు పదహారు సంవత్సరాల ప్రాయంలో బాబా మహారాష్ట్రలోని అహమ్మద్ నగర్ జిల్లాకు చెందిన షిరిడీకి వచ్చాడని, అక్కడ మూడేండ్లు ఉండి తరువాత తరువాత కొంత కాలం కనుపించలేదని, మళ్ళీ ఒక సంవత్సరం తరువాత (షుమారు 1858లో) షిరిడీకి తిరిగి వచ్చాడనీ అత్యధికులు విశ్వసించే విడయం. ఈ ప్రకారం బాబా షుమారు 1838లో జన్మించి ఉండవచ్చును.
ఆ యువకుడు ఒక వేప చెట్టు క్రింద ధ్యానంలో రాత్రింబవళ్ళు కూర్చుని ఉండేవాడు. అతనిని చూచి గ్రామస్తులు ఆశ్చర్యపడ్డారు. మహాల్సాపతి, అప్పా జోగలే, కాశీనాధ వంటి ధార్మిక చింతనాపరులైన గ్రామస్తులు బాబాను తరచు దర్శించసాగారు. అతడు పిచ్చివాడని మరి కొందరు రాళ్ళు కూడా రువ్వేవారు. మళ్ళీ కొంతకాలం కనుపించకుండా పోయిన సమయంలో అతనెక్కడికి వెళ్ళాడో ఎవరికీ తెలియదు. అప్పుడు అతను చాలా మంది సాధువులను, ఫకీరులను కలిశాడని, 1857లో ఝాన్సీ లక్ష్మీబాయి అధ్వర్యంలో జరిగిన మొదటి స్వాతంత్ర్య సంగ్రామంలో సైనికుడిగా పాల్గొని ఉండవచ్చుననీ, కొంతకాలం నేత పని చేశాడనీ కొన్ని సూచనల వలన తెలుస్తున్నాయి.
షిరిడీలో నివాసం తన మసీదు వరండాలో సాయిబాబా1858లో చాంద్ పాటిల్ కుటుంబపు పెళ్ళివారితో కలిసి బాబా షిరిడీ వచ్చాడు. అక్కడ ఖండోబా మందిరం దగ్గర అతను బండి దిగినప్పుడు మందిరం పూజారి మహాల్సాపతి “దయ చేయుము సాయీ” అని పిలిచాడు. తరువాత ‘సాయి’ పదం స్థిరపడి అతడు “సాయిబాబా”గా ప్రసిద్ధుడైనాడు. షిరిడీ ప్రాంతంలో సాము గరిడీలు, కుస్తీలు ప్రసిద్ధం. సాయి వేషధారణ కుస్తీ పహిల్వాన్‌లలాగా ఉండేది. ఒకసారి ‘మొహిదీన్ తంబోలీ’ అనే వానితో కుస్తీ పట్టి ఓడిపోయిన తరువాత బాబాలో చాలా మార్పు వచ్చింది. సూఫీ ఫకీరులలాగా మోకాళ్ళవరకు ఉండే ‘కఫనీ’, తలకు టోపీలాగా చుట్టిన గుడ్డ ధరించడం మొదలుపెట్టాడు.  ఇలా ముస్లిం ఫకీరులా ఉండే బాబాకు స్థానిక హిందువులనుండి కొద్దిపాటి ప్రతిఘటన కూడా ఎదురయ్యింది.

1918లో తన మరణం వరకు సాయిబాబా షిరిడీలోనే ఉన్నాడు. ఒక పాత మసీదును తన నివాసం చేసుకొన్నాడు. యాచన అతని వృత్తి. మసీదులో ధునిని వెలిగించాడు. అందులోనుండి విభూతిని తీసి తన దర్శనానికి వచ్చేవారికి పంచేవాడు. అది తమకు రక్షణ ఇస్తుందని భక్తులు నమ్మేవారు. వచ్చిన వారికి ఉపదేశాలు, ధర్మ బోధలు చేసేవాడు. చాలా మహత్తులు చూపించేవాడని భక్తులు చెబుతారు. స్వయంగా వండి ప్రసాదాన్ని పంచేవాడు. ఉత్సవాలలో పాల్గొనేవాడు. ఒకోమారు విపరీతంగా కోపం చూపేవాడు.
1910 తరువాత సాయిబాబా పేరు దేశమంతటా తెలిసింది. గొప్ప మహత్తులు చూపే సాదువనీ, లేదా అవతారమని విశ్వసించే భక్తులు పెక్కురు బాబా దర్శనానికి రాసాగారు. అక్టోబరు 15, 1918 మధ్యాహ్నం 2.30కి బాబా తన భక్తుని వడిలో కన్ను మూశాడు (మహా సమాధి చెందాడు). అతని దేహం బూటెవాడలో ఖననం చేయబడింది. అక్కడే ‘సమాధి మందిరం’ నిర్మించబడింది.



3 comments

  1. one thing i want to say about sai baba...No body knows when he was born, his parents, his original names and all....He is not a freedom fighter...he didnt participate in any other revolutionary movements...he is one n only saint who always prays his GURU and says ALLA MALIK . we pray sai as GOD.... So plz dont involve him in any movements..He didnt work any where..this is 100% true.

    ReplyDelete
  2. Thanks for your comment Lakshmi Gaaru...!
    Sai cheppina matallo mukyamainadi Sab Ka Malik Ek Hai.
    Ekkada puttado telyadu...kaani andari manasu dochina fakhir.
    enno jeeva satyaalu cheppina goppa vyakthi. oh sadaarana jeevitham gadipi andari manasu dochadu.
    Sai gurunchi manaku telisinde kochume lakshmi gaaru.
    sure meeru annadi naaku ardham aindi..ikkada post chesindi kuda nenu chadivinde nenu rasindi kaadu.-m&k

    ReplyDelete
  3. @bharatiyulam
    షిర్డీ సాయిబాబా (?? - అక్టోబర్ 15, 1918) భారతీయ గురువు మరియు సాధువు, ఫకీరు. ఇతని అసలు పేరు, జన్మ స్థలం తెలియదు. సాయిబాబాను అనేకులుముస్లింలు, హిందువులూ సాధువుగా నమ్ముతారు. ఇతని జీవిత నడవడిలో, భోధనలలో రెండు మతాలను అవలంభించి, సహయోగము కుదర్చడానికి ప్రయత్నించాడు. సాయిబాబా మసీదులో నివసించాడు, గుడిలో సమాధి అయ్యాడు. రెండు మతాల పద్ధతులను తన బోధనలో అవలంభించాడు. ఈయన రెండు సాంప్రదాయాల యొక్క పదాలను, చిత్రాలను ఉపయోగించాడు. ఈయన యొక్క వ్యాఖ్యలలో ముఖ్యమైన ఒక వాక్యము అల్లా మాలిక్, సబ్ కా మాలిక్ ఎక్ (सबका मालिक एक) (అందరి ప్రభువు ఒక్కడే). పెక్కుమంది భక్తులు (ప్రధానంగా హిందూ సంప్రదాయానికి చెందినవారు) సాయిబాబాను శివుని, దత్తాత్రేయుని అవతారం అయిన సద్గురువుగా భావిస్తారు.

    సాయిబాబా బోధనలో ప్రేమ, కరుణ, దానం, సంతృప్తి, శాంతి, దైవారాధన, గురుపూజ ముఖ్యమైనవి. అద్వైతం, భక్తి మార్గం, ఇస్లాం సంప్రదాయాలు అతని బోధనలలోనూ, జీవనంలోనూ మిళితమై ఉన్నాయి. ఎంతో మంది, ప్రధానంగా మహారాష్ట్ర, గుజరాత్, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలనుండి సాయిబాబాను దైవ స్వరూపునిగా నమ్మి ఆరాధిస్తున్నారు.అతను హిందువా, ముస్లిమా, దేవుడా, గురువా, సామాన్యుడా అన్ని విషయాల గురించి పలు వాదాలున్నాయి.

    ReplyDelete

పాఠకులందరికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు.ఇట్లు - భారతీయులం