కూల్‌డ్రింక్స్‌. ఈ కార్బొనేటేడ్‌ కూల్‌డ్రింక్స్‌ తాగే ముందు మానవ ఆరోగ్యంపై ఎంత ప్రభావం కలుగజేస్తాయో తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.తీయని పానీయాల గురించి కొన్ని చేదు వాస్తవాలు మీకు తెలుసా?@ భారతీయులం

వేసవి ముదురుతోంది... మండు తున్న ఎండల్లో చెమటలు కారుతు ంటే అలసిన శరీరా నికి చల్లగా, స్వాంతన కోసం చూస్తే ప్రతి గల్లీలోనూ పెద్ద ఎత్తున హౌర్డింగ్స్‌, డిజిటల్‌ బోర్డులతో మన మనసుల్ని లాగేస్తుం టాయి. కూల్‌డ్రింక్స్‌. ఈ కార్బొనేటేడ్‌ కూల్‌డ్రింక్స్‌ తాగే ముందు మానవ ఆరోగ్యంపై ఎంత ప్రభావం కలుగజేస్తాయో తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.ఇటువంటి కార్బొనేటెడ్‌ కూల్‌డ్రింక్స్‌ ప్రజల ఆరోగ్యాన్ని కూడా పెద్ద ఎత్తున కొల్లగొడుతున్నాయని శాస్త్రీయంగా నిరూపితమైంది.

మీకు తెలుసా?
తీయని పానీయాల గురించి కొన్ని చేదు వాస్తవాలు:
* కూల్‌డ్రింకుల్లో శుష్కకేలరీలు కల్గివుండడం తప్పించి, పోషక విలువల రీత్యా ప్రయోజనం శూన్యం. అంతే కాక ఇవి తాగడం వల్ల అదే సమయంలో తాగగల్గిన సహజ, పోషక విలువలున్న పానీయాలకు దూరంగా ఉంటాం. ఫలితంగా పోషక విలువల లోపం ఏర్పడుతుంది.

* వీటిలోని అదనపు కేలరీలు స్థూలకాయానికి దారితీస్తాయి. పైగా కూల్‌డ్రింక్స్‌లో ఉండే కేలరీలతోపాటు ఇంకోరకంగా కూడా అదనపు కేలరీలు చేరుతాయి. కూల్‌డ్రింక్స్‌ తాగినప్పుడు ఇవి వేగంగాకడుపు దాటి జీర్ణవ్యవస్థలోకి చేరతాయి. రిజర్వాయర్‌ లాంటి కడుపులో ఎక్కువసేపు ఉండవు గనుక, కడుపు నిండుగా ఉన్నట్లు మెదడుకు సంకేతాలు వెళ్లవు. కాబట్టి మరలా ఏదో ఒక ఆహారం తింటునే ఉండడం వల్ల స్థూలకాయానికి దారితీస్తుంది.

* కూల్‌డ్రింక్స్‌ హైగ్లైసిమిక్‌ ఇండెక్స్‌ కల్గిఉండడం వల్ల, వేగంగా రక్తంలో గ్లూకోజ్‌ స్థాయి పెరిగి ఇన్సులిన్‌ విడుదల అవుతుంది. దీంతో క్లోమగ్రంథిపై ఒత్తిడి పెరుగుతుంది. ఫలితంగా దీర్ఘకాలంగా మధుమేహం వచ్చే అవకాశం పెరుగుతుంది.

* కూల్‌డ్రింక్స్‌ రూపంలో తీసుకునే అధిక ఫ్రక్టోజ్‌ వినిమయం వల్ల అధిక రక్తపోటు వస్తుందని అధ్యయనాలు తెలియజేస్తున్నాయి.

* కూల్‌డ్రింక్స్‌ వినియోగం వల్ల ఎముకలలో కాల్షియం మెటబాలిజం ప్రభావితమై, శరీరంలోని కాల్షియం- ఫాస్పరస్‌ నిష్పత్తి దెబ్బతిని బలహీనపడి ఆస్టియోపోరోసిస్‌ వచ్చే అవకాశముంది.

* కూల్‌డ్రింక్స్‌లో ఉండే యాసిడ్‌ (సిట్రిక్‌ ఆమ్లం లేదా ఫాస్పారిక్‌ ఆమ్లం) వల్ల పంటిపై ఉండే ఎనామిల్‌ పొర కరిగిపోయి పిప్పి పళ్లు ఏర్పడతాయి.

* కూల్‌డ్రింక్స్‌ వాడకం వల్ల కిడ్నీలో రాళ్లు ఏర్పడతాయి. ఎలా అంటే వీటిలో ఉండే యాసిడ్‌ను ఎముకల్లో ఉండే కాల్షియాన్ని తటస్థం (బఫరింగ్‌) చేస్తుంది. ఈ క్రమంలో ఏర్పడే మినరల్స్‌ అసమతుల్యత వల్ల దీర్ఘకాలంగా కిడ్నీలో రాళ్లుఏర్పడతాయి.

* కూల్‌డ్రింక్‌లో ఉండే యాసిడ్‌ ఎదలో మంట (హార్ట్‌బర్న్‌) కలుగజేస్తుంది.

* కూల్‌డ్రింక్స్‌ రెగ్యులర్‌గా వాడడం వల్ల అధిక రక్తపోటు, కొలెస్టారాల్‌, ఇన్సులిన్‌ రెసిస్టెన్స్‌ వంటి వ్యాధుల సముదాయమైన 'మెటబాలిక్‌ సిండ్రోం' సంభవిస్తుంది.

* దీర్ఘకాల కూల్‌డ్రింక్స్‌ వినియోగించిన వారిలో లివర్‌ సిర్రోసిస్‌ మార్పులు జరిగే అవకాశం ఉన్నట్లు పరిశోధనలు వెల్లడిస్తున్నాయి.

* కూల్‌డ్రింక్స్‌లోని అసిడిక్‌ పిహెచ్‌ వల్ల జీర్ణవ్యవస్థలో ఎంజైముల పనివిధానం ప్రభావితమై పలురకాల జీర్ణవ్యవస్థ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి.

* కూల్‌డ్రింక్స్‌లో ఉండే కార్బన్‌డయాక్సైడ్‌, పాస్ఫారిక్‌ ఆమ్లాలు శరీర కణాల్లోని ఆక్సిజన్‌ నిల్వలను తగ్గించడం ద్వారా క్యాన్సర్‌ దారితీయవచ్చని ఇంగ్లండ్‌లోని న్యూకాజిల్‌ విశ్వవిద్యాలయం జరిపిన అధ్యయనంలో వెల్లడైంది.

* కూల్‌డ్రింక్స్‌లో తీయదనం కోసం వాడే 'ఆస్పర్టేమ్‌' అనే కృత్రిమ తీపిపదార్థం చక్కెర కంటే 200 రెట్లు తియ్యగా ఉంటుంది. దీని రసాయనిక నిర్మాణంలో ఉండే ఆస్పర్టిక్‌, ఫినైల్‌ అలనిన్‌, మిథైల్‌ ఆల్కహాలు శరీరంలో విచ్చిన్నం చెందినప్పుడు దీర్ఘకాలిక పరిణామంగా క్యాన్సర్‌కు దారితీయవచ్చు.

* బ్రిటీష్‌ యూనివర్శిటీ జరిపిన అధ్యయనాల ప్రకారం ఫాంటా, పెప్సిమాక్స్‌ డ్రింక్స్‌లో కలిపే 'సోడియం బెంజోయేట్‌' అనే ప్రిజర్వేటివ్‌ రసాయనం కణాల్లోని డిఎన్‌ఎపై ప్రభావం చూపడం ద్వాఆర కణవ్యవస్థకు నష్టం కలుగుతుంది.

* ఢిల్లీలోని సెంటర్‌ ఫర్‌ సైన్స్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌ జరిపిన అధ్యయనం వెల్లడి చేసి ప్రకారం కూల్‌డ్రింక్స్‌లో మానవశరీరానికి హానికరమైన స్థాయిలో పురుగు మందు అవశేషాలు ఉన్నాయని తేలింది. వీటి దుష్ఫలితాలు అనేకం.

* ఇవిగాక కేరళలోని ప్లాచిమాడ ప్రాంతంలోనూ, రాజస్థాన్‌లోని కాలా-డేరా ప్రాంతంలోనూ కోకోకోలా ప్లాంట్‌ వల్ల భూగర్భ జలాలు అడుగంటిపోయి వ్యవసాయం తీవ్రంగా దెబ్బతిన్నది. వ్యర్ధపదార్థాలు విసర్జన వల్ల ఆ ప్రాంత ప్రజలు తీవ్ర అనారోగ్యా పాలవడం, అందుకు ప్రతిగా ఆ ప్రాంతాల్లో ప్రజలుపెద్ద ఎత్తున కోలా కంపెనీలకు వ్యతిరేకంగా ఉద్యమించడం మనం చూస్తున్నాం.
................................................................................................
కొన్ని చేదు వాస్తవాలు:
* కోకోకోలాను టాయలెట్స్‌ శుభ్రం చేయడానికి ఉపయోగించవచ్చు. టారులెట్‌లోని విట్రియన్‌పైన మరకలను కోకోకోలా ఉండే యాసిడ్‌ ఒకే ఒక గంటలో మటుమాయం చేస్తుంది.

* పాశ్యాత్య దేశాల్లో రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు రక్తం మరకలును శుభ్రం చేయడానికి క్రూడ్‌కోక్‌ను హైవే పెట్రోలింగ్‌ వ్యాన్స్‌లో ముందస్తుంగా ఉంచుతారు.

* బాటరి టెర్మినల్స్‌పై ఏర్పడిన తుప్పును శుభ్రం చేసేందుకు కోకోకోలాను ఉపయోగించొచ్చు.

* మన ఇళ్లల్లో తుప్పు పట్టిన బోల్టు ఏదైనా వదులు చేయాలంటే కోకోకోలాలో ముంచిన గుడ్డతో కొద్ది నిమిషాలు తుడిస్తే సరి. ఇట్టే పరిష్కారం లభిస్తుంది.

* మనిషి మరణించాక కూడా దేహంలో చెక్కుచెదరకుండా కొన్ని ఏళ్లపాటు ఉండేవి శరీరంలోని ఎముకుల, దంతాలు. అటువంటి మన నోట్లో ఉండే పన్నును కోలాడ్రింక్స్‌లో వేస్తే 48గంటల్లో మెత్తగా అయిపోతుంది. మొత్తం 10 రోజుల్లో కనపడకుండా కరిగిపోతుంది.

* ఢిల్లీ విశ్వవిద్యాలయంలో ఒక తమాషా పోటీ పెట్టుకున్నారు. ఎవరు అతి ఎక్కువ కోక్‌ తాగగలరు? అనేది ఆ పోటి. ఒక్క పెట్టున 8 సీసాల కోక్‌ తాగి విజేతగా నిలిచిన అతడు మరునిమిషంలోనే కుప్పకూలి మరణించాడు. శరీరంలో ఒక్కసారిగా కార్బన్‌డయాక్సైడ్‌నిల్వలు అనూహ్యంగా పెరిగిపోతాయి. ఆక్సిజన్‌ అందకపోవడం వల్ల (హైపాక్సీమియా)తో మరణించాడు. తదనంతరం ఢిల్లీ యూనివర్శిటీ క్యాంపస్‌లో కోకోకోలాల వాడకాన్ని నిషేధించారు..@ భారతీయులం | www.facebook.com/bharatiyulam 

0 comments:

Post a Comment

పాఠకులందరికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు.ఇట్లు - భారతీయులం