గానకోకిల జానకమ్మకు జన్మదిన శుభాకాంక్షలు..''నేను ఉన్నంతవరకూ పాడాలి... పాడుతున్నంతవరకూ వుండాలి'' అని అంటున్నారు ఎస్‌. జానకి.@ భారతీయులం

గానకోకిల జానకమ్మకు జన్మదిన శుభాకాంక్షలు..
''మా అమ్మగారు స్కూల్‌ టీచర్‌. వర్షధారలు కురిసే బడిలో ఓ పక్కగా ఒదిగి చదువుకున్న అమ్మాయిని నేను. కానీ కొన్ని భాషల్లో పాడగలుగుతున్నానూ అంటే, అది నిజంగా భగవంతుని అనుగ్రహమే! అనిచెప్పారు.
''నాకు బాల్యం నుంచే ఆస్థమా వుండేది. రికార్డింగులు జరుగుతున్నప్పుడు ఈ సమస్య ఎక్కువై, పాడలేకపోయిన సంఘటనలూ వున్నాయి. ఈ వయసులో కూడా ఇంత మధురంగా పాడగలగటానికి కారణం కూడా ఆ భగవంతుడే!
''నాది ప్రేమవివాహం. నా భర్త రామ్‌ప్రసాద్‌ గారి ఫోటోను దాచుకుని దాన్ని చూసి చూసే ఆయన్ను గాఢంగా ప్రేమించాను...'' అంటున్న జానకిగారి జీవితంలో ఇంకా, పెళ్లికి ముందే అత్తింట్లో కాపురం, పెళ్లి, సంతానం, సినిమాల్లో ప్రవేశం, సహగాయనీమణులు, సంగీతదర్శకులతో రకరకాల అనుభవాలు, విందులు, అభిమానులు... ఇట్లా మనకు తెలియని ఎన్నో సంగతులున్నాయి.
''నేను ఉన్నంతవరకూ పాడాలి... పాడుతున్నంతవరకూ వుండాలి'' అని అంటున్నారు ఎస్‌. జానకి.@ భారతీయులం 

0 comments:

Post a Comment

పాఠకులందరికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు.ఇట్లు - భారతీయులం