చూయింగ్ గమ్ ! నములుతూ ఉండటం..స్టైల్ గా మారింది.అసలేంటి ఈ చూయింగ్ గమ్ ? చూయింగ్ గమ్ మింగితే ? తిప్పలు తప్పవా ? @ భారతీయులం
చూయింగ్ గమ్ ! ఇది ఇప్పుడు ఒకరకమైన స్టైల్ గా మారింది.
ప్రతినిత్యం చూయింగ్ గమ్ ను నములుతూ ఉండటం..! ఐతే అసలేంటి ఈ చూయింగ్ గమ్ ? ఒకవేళ పొరపాటున మింగితే ఏంటి సంగతి ? మీ అపోహలకు ఇదిగో సమాదానం.
చూయింగ్ గమ్:
చూయింగ్ గమ్ కృత్రిమ రబ్బర్ తో తయారు చేసే ఒక తినే పదార్థం.
చూయింగ్ గమ్ చరిత్ర 1866 సంవత్సరంతో ముడిపడి వుంది. మెక్సికో దేశపు సైనిక నియంత సాంటా అన్నాతో జతపడి వుంది. 1866నాటి తన దేశపు అంతర్యుద్ధ్యం సందర్భంగా సాంటా అన్నా అజ్ఞాతంలోకి వెళుతూ దళసరిగా తెల్లగా వున్న జిగురు ముక్కను తన వెంట పట్టుకునిపోయాడు. మెక్సికోలోని ఒక తరహా చెట్టు బెరడు నుండి స్రవించే ఈ జిగురును ప్రతికూల పరిస్థితుల్లో చప్పరించడం అక్కడి వారికి ఆనవాయితీగా వస్తోంది. సాంటా న్యూయార్క్‌లోని స్టేటన్ దీవిలో తలదాచుకున్నాడు.
కొన్ని నెలల తర్వాత స్వదేశానికి తిరిగి వచ్చాడు సాంటా. తను వుపయోగించగా మిగిలిన జిగురు ముక్కను తన టేబుల్ సొరుగులో వదిలేసాడు. అదే దీవిలో వున్న థామస్ ఆడంస్ అనే శాస్త్రవేత్త ఆ జిగురు ముక్కను చేజిక్కించుకున్నాడు. సాంటా ఆ జిగురు ముక్కను నములుతూ వుండేవాడని థామస్ తెలుసుకున్నాడు. సాగుతున్న పదార్థంలో ఏం రుచి వుందో ఆయనకు అర్థం కాలేదు. జిగురును సేకరించి ఒకరకమైన రబ్బరును రూపొందించాలనుకున్నాడు కానీ అది తయారవ్వలేదు. కృత్రిమ దంతాలు అమర్చడానికి ఆ జిగురు ఉపయోగపడుతుందేమోనని ప్రయోగం చేశాడు. కానీ అది సాథ్యం కాలేదు.
చివరకు థామస్ ఆ జిగురును ఉడకబెట్టి చిన్న చిన్న పుల్లలు తీసుకుని వాటి చివరన ఈ ఉడికించిన జిగురును అతికించి పంచదార బిళ్లలు అమ్మే దుకాణాల్లో అమ్మాలని ప్రయత్నించాడు. ఈ ప్రయోగం విజయవంతం అవడంతో విపరీతమైన ప్రేరణ పొందడు. దానితో గమ్‌స్టిక్స్ వ్యాపారం మొదలైంది. వేలాదిగా వీటిని తయారుచేసే యంత్రాన్ని కనిపెట్టి, తన ఉత్పత్తికి చూయింగ్ గమ్ అని పేరు పెట్టాడు.
చూయింగ్ గమ్ మింగితే ? తిప్పలు తప్పవా ?
చాలా మంది పొరబాటుగా చూయింగ్ గమ్ మింగేసి ఉంటారు ...ఐతే అది రబ్బరు పదార్ధం తో చేసింది ఉండటం వలన అది మన పొట్టలో అరగదు.
కొందరు చూయింగ్ గమ్ మింగింతే, అది తమ పొట్టలోనే ఉంటది అంటూ బయపెడతారు ..ఐతే ఇది ఉండటం కాదు అరగక పోవటం వలన....ఓహ్ చూయింగ్ గమ్ మన పొట్టలో అరగడానికి సుమారు ఏడు సంవత్సరాలు పడుతుంది, ఐతే సాదారణంగా మన ప్రక్రియ ప్రకారం ఇరవై నాలుగు గంటలకల్లా అది వచ్చేయాలి జీర్ణాశయం నుండి లేని యడల అది మనకి పోట్టనోప్పిని ఇస్తుంది అరగక పోవడం వలన. అందుకే మనము చూయింగ్ గమ్ మింగిన కుడా కొందరికి ఏమి కాదు మరి కొందరికి తిప్పలు తప్పవు రబ్బరు పదార్ధం వలన. తస్మాత్ జాగర్త.@ భారతీయులం | www.facebook.com/bharatiyulam
0 comments:
Post a Comment
పాఠకులందరికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు.ఇట్లు - భారతీయులం