వరకట్న నిషేధం:సమాజంలో వరకట్నమనేది సామాజిక దురాచారం.దీని వలన స్త్రీలపై ఊహకందని రీతిలో చిత్రహింసలు, నేరాలు జరుగుతున్నాయి.@ {భారతీయులం}

వరకట్న నిషేధం

సమాజంలో వరకట్నమనేది సామాజిక దురాచారం.   దీని వలన స్త్రీలపై ఊహకందని రీతిలో చిత్రహింసలు, నేరాలు జరుగుతున్నాయి. సమాజంలోగల అన్నివర్గాల స్త్రీల జీవితాలపై, అంటే  వారు పేదవారుగాని, మధ్యతరగతివారు గాని, సంపన్న స్త్రీలుగాని  ఇది దుష్ప్రభావాన్ని చూపుతోంది.అయినప్పటికినీ  అవగాహన రాహిత్యం, చదువు లేక పోవడంవల్ల వరకట్నమనేది ఎక్కువగా  బీద కుటుంబాలలోగల స్త్రీలను బలిగొంటోంది.

వరకట్నవ్యవస్థ వలన కొడుకులకు, కూతుళ్ళ కన్నా ఎక్కువ విలువ ఇవ్వడం జరుగుతోంది. కూతుళ్ళంటే భారంగానూ, వారిని తమ చెప్పుచేతలలో  ఆధీనంలో ఉంచుకోవడంగానూ , మరియు చదువు చెప్పించడంలోనూ ఇతర సదుపాయాలు అందించేటప్పుడూ  రెండవ స్థానంగా చూడడం సమాజంలో , చాల సార్లు చూస్తుంటాము.
నేడు మన ప్రభుత్వం చాలా శాసనాలు , సంస్కరణలను ప్రవేశపెట్టడమే కాకుండా , వరకట్న  వ్యవస్థ నిర్మూలనయే గాక, ఆడపిల్ల స్థాయిని పెంచేదిశలో అనేక పథకాలను తీసుకువచ్చింది.

సమాజంలోచాలావరకు పరిస్థితిని అవగాహన చేసుకోవడం జరిగింది. వరకట్నాన్ని ఇవ్వడం, తీసుకోవడాన్ని ఆపడంలో మనందరమూ కూడ ఆవశ్యకమార్పు కొరకు చురుకైన ప్రయత్నాలు చేయాలి. మనకందరికి తెలిసిన విషయమేమిటంటే మొదటగా మన కూతురి విషయంలో ఆమెకు మనం విలువ ఇస్తే ఇతరులు కూడ వారు పెద్దయినప్పుడు ఆ విలువను  గ్రహిస్తారు.

ప్రాధమికమైన కొన్ని ఆచరణలను పాటించడం వలన వరకట్నానికి ముగింపు పలకవచ్చుః
1.మీ ఆడపిల్లలను చదివించండి.
2.వారు స్వప్రయోజకులుగా అయ్యేటట్లు ప్రోత్సహించండి.
3.స్వతంత్రంగాను, బాధ్యతతోటి ప్రవర్తించేటట్లు బోధించండి.
4.వారిపై (మీ ఆడపిల్లను) వివక్ష చూపకండి.
5.కట్నంతీసుకోవడం, పుచ్చుకోవడాన్ని ప్రోత్సహించకండి. @ {భారతీయులం} 

4 comments

పాఠకులందరికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు.ఇట్లు - భారతీయులం