తల్లి పుట్టిన తర్వాతే తెలిసింది లోకానికి ప్రేమ పుట్టిందని....! By: సాయి కిరన్మయి || "భారతీయులం"
తల్లి పుట్టిన తర్వాతే తెలిసింది లోకానికి ప్రేమ పుట్టిందని....
ఒక శ్వాస ఆడటానికి తన శ్వాస నిర్బందించి
కడుపులో పడ్డప్పటి నుంచి కడుపు చీల్చుకు వచ్చే వరకు
బాధలన్ని సంతోషంగా భరించేది తల్లి ప్రేమ. ప్రేమనంత పాలధారగా మార్చి
ముసి ముసి నవ్వుల ముద్దు మాటల - మురిపాల చేష్టలే
లోకంగా బ్రతికి తన మనుగడనే మరచి
బిడ్డ ఎదుగుదలను ఆకాంక్షించి ఏ కష్టానికైనా.... చలించక శ్రమించి
మన బ్రతుకునకు బంగారు బాటలు వేస్తుంది. మరి తన ప్రేమలో ఏ లోపం జరిగిందో
నేడు ప్రతి బిడ్డ తల్లి గుండెను కానుకగా అడిగేవాడే.... అవసరం తీరాక అనాధ ఆశ్రమాలకు తరిమే వాడే.....
ఎక్కడుంది లోపంతన పెంపకం లోనా...? లేక ఎదిగే బిడ్డ ఆలోచనలలోనా...??
By: సాయి కిరన్మయి || "భారతీయులం"
-=-=-=-=-=-=-=-=-=-=-
0 comments:
Post a Comment
పాఠకులందరికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు.ఇట్లు - భారతీయులం