ప్రేమ శాశ్వతం కానీ కన్నవారి ప్రేమ ముందు మద్యలో వచ్చిన ప్రేమ గొప్పకాదు.!! ప్రేమ కు విలువ లేదు పెళ్లి కి విలువ లేదు. @ {భారతీయులం}

అనుకోకుండా కలిసాం !

స్నేహం చేయద్దు అనుకున్నాం కానీ స్నేహం కుదిరింది..ఆశలు పెంచుకోవద్దు అనుకున్నాం కానీ ఆశలు పెరిగిపోయాయి..

మాట్లాడద్దు అనుకున్నాం కానీ మాట్లాడకుండా ఉండలేకపోయాము...చూడకూడదు అనుకున్నాం కానీ చూడకుండా ఉండలేకపోయాము...

దేగ్గరవ్వకూడదు అనుకున్నాం కానీ దేగ్గరవ్వకుండా ఉండలేకపోయాము...కలిసి జీవితం గడపాలనుకున్నాం ... చేత నైన ప్రయత్నాలు చేసాం కానీ..

కలిసి జీవించే ఆలోచన మార్చుకొని ...విడిపోయే ఆలోచనలో పడ్డాము..ఇద్దరు అర్ధం చేసుకొని విడిపోతే ..బాదపడేది ఇద్దరే ..కానీ 

రెండు కుటుంబాలకు తెలిసి విడిపోతే ...బాదపడేది ఇద్దరు కాదు ఇరు కుటుంబాలు అని తలచి...కష్టమైన ఇష్టమున్న విడిపోదాం అని అనుకున్నాము.

"ప్రేమ శాశ్వతం కానీ కన్నవారి ప్రేమ ముందు మద్యలో వచ్చిన ప్రేమ గొప్పకాదు.!!"

ప్రేమించడం నేరం కాదు ..మనతో పాటు మన కుటుంబాన్ని కుడా బాద పెట్టడం పెద్ద నేరం.

ప్రేమించి పెళ్ళిచేసుకొని పెద్దలను ఎదురించి విడిపోయే వారు ఎక్కువయ్యారు...ఇలాంటి వాళ్ళ వల్ల ప్రేమ కు విలువ లేదు పెళ్లి కి విలువ లేదు. @ {భారతీయులం} | అని-జాను 


1 comments

  1. ప్రేమ ఎప్పుడు శాశ్వతం
    ప్రేమ ఎప్పుడు శాశ్వతం దానికి కొలబద్ద కూడా లేదు. తక్కువ ఎక్కువ అని కూడా వుండదు. ప్రేమ అంటే ప్రేమే. ముందు వచ్చినా, మధ్యలో వచ్చినా, వెనక వచ్చినా, అది ప్రేమే. అలాగే అరిషడ్వర్గాలు అంటే కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు. వీటికి కూడా కొలబద్దలు వుండవు. అయితే వచ్చింది ప్రేమా? లేక మొహమా? కామమా? అనేది ప్రశ్న
    తరువాత, ప్రేమించి పెళ్ళిచేసుకొని పెద్దలను ఎదురించి విడిపోయే వారు ఎక్కువయ్యారు...ఇలాంటి వాళ్ళ వల్ల ప్రేమకు విలువ లేదు పెళ్లికి విలువ లేదు. ఈ అంచనా తప్పు. పెద్దలు కుదిర్చిన పెళ్ళిళ్ళు కూడా విడిపోవడానికి ఆస్కారం వుంది. అక్కడక్కడ విడిపోతున్నాయి. పెద్దలు కుదిర్చినా, ప్రేమలో పడ్డా, ప్రేమ పాళ్ళు తక్కువై, కామము (కోరికలు ఉదా || శుభ లగ్నం లో మాదిరి, ఆహ్వానం లో మాదిరి అవి కూడా కామమే అంటే మానసిక కామం ) పాళ్ళు ఎక్కువైతే విడిపోవడమే జరుగుతుంది. ఇది ఒక కారణం. మరిన్ని కారణాలకు విడాకులు కథలు చూడండి Details http://alochinchandimedhavullara.blogspot.in/

    ReplyDelete

పాఠకులందరికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు.ఇట్లు - భారతీయులం