ఒక భారతీయునికి ఇంకేం కావాలి.@ {భారతీయులం}

గుండె ఒక్కసారిగా తడిసి ముద్దవుతుంది.
వంటి మీద వెంట్రుకలకి కూడా దేశభక్తి ఉందేమో
దేశం పేరు చెప్పగానే నిక్కపొడుచుకొని మరీ
వందనాలర్పిస్తున్నాయి.
కళ్ళు రెండూ కన్నీటి బిందువులవుతున్నాయి.
జెండాకర్ర పతాకని మోస్తున్నట్లు
కన్నీటి చారిక బుగ్గపై నిలబడి కళ్ళని మోస్తూ
రెప్పల ముడిలాగినప్పుడల్లా
అశ్రు బిందువుల్ని పువ్వుల్లా జలజలా రాలుస్తున్నాయి.
నిన్న – నన్ను ధన్య జీవిలా నిలబెట్టిన ఈ నేల
తమ స్వేద బిందువులతో స్వాతంత్ర్యపు పాదుల్ని
తడిపిన త్యాగధనుల్ని కన్న ఈ నేల
నాదేనన్న భావం రాగానే శరీరం మొత్తం
ప్రకంపనల పరవళ్ళతో పులకరించిపోతుంది.
దేశంలోని మట్టి మొత్తాన్ని
నలుగు పిండిలా పులుముకోవాలన్నదే తపన.
ప్రకృతి మొత్తాన్ని గాఢ పరిష్వంగం చేసి
గుండెల్లో నిలుపుకోవాలన్నదే ఆవేశం.
అవని ప్రేమ అణువణువునా పులకరించడం కన్నా
ఒక భారతీయునికి ఇంకేం కావాలి.@ {భారతీయులం}
  

0 comments:

Post a Comment

పాఠకులందరికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు.ఇట్లు - భారతీయులం